Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

Booster Dose

Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు కాలపరిమితిని తగ్గిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. అనేక శాస్త్రీయ ఆధారాలు, ప్రపంచ అధ్యయనాల దృష్ట్యా బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించాలని ‘నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్‌’ కేంద్రానికి సిఫార్సు చేసింది.

Make in India: ‘మేకిన్ ఇండియా’ ఫలితం.. 70 శాతం తగ్గిన బొమ్మల దిగుమతులు

దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, ఇళ్లల్లో బూస్టర్ డోసు అందించేందుకు రాష్ట్రాలు సన్నద్ధం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇంతకుముందు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ మాత్రమే ఆరు నెలలకు బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉండేది. వీరికి ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తోంది. ఇప్పుడు అందరికీ ఈ వెసలుబాటు కలగనుంది. బూస్టర్ డోసు ప్రైవేటు సెంటర్లలోనే అందించే ఏర్పాట్లు ఉన్నాయి.