Make in India: ‘మేకిన్ ఇండియా’ ఫలితం.. 70 శాతం తగ్గిన బొమ్మల దిగుమతులు

అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాతం తగ్గాయి.

Make in India: ‘మేకిన్ ఇండియా’ ఫలితం.. 70 శాతం తగ్గిన బొమ్మల దిగుమతులు

Make In India

Make in India: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సత్ఫలితాల్ని ఇస్తోంది. అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇది మంచి ఫలితాల్ని ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించారు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అడిషనల్ సెక్రటరీ అనిల్ అగర్వాల్.

LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాతం తగ్గాయి. అలాగే ఎగుమతులు 61 శాతం పెరిగాయి. బొమ్మలకు సంబంధించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా అనిల్ అగర్వాల్ బొమ్మల తయారీ, వ్యాపారం వంటి అంశాలపై మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల బొమ్మల తయారీ కంపెనీలు లబ్ధిపొందాయి. దిగుమతులు కొన్నింటికే పరిమితమయ్యాయి. వీడియో గేమ్ కన్సోల్స్, టేబుల్ లేదా పార్లర్ గేమ్స్, ఆటోమేటిక్ బౌలింగ్ ఆలే ఎక్విప్‌మెంట్, ట్రై సైకిల్స్, స్కూటర్స్, పెడల్ కార్స్, సిమిలర్ వీల్డ్ టాయ్స్ వంటి దిగుమతులు 70.35 శాతం తగ్గాయి.

Arvind Kejriwal: ఢిల్లీలో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్’… ప్రకటించిన కేజ్రీవాల్

2018-19లో 371 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలు దిగుమతి చేసుకోగా, 2021-22లో 110 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మల్ని మాత్రమే ఇండియా దిగుమతి చేసుకుంది. దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు 61.38 శాతం పెరిగాయి. బొమ్మల తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల ద్వారానే ఇది సాధ్యమైందని అనిల్ అగర్వాల్ తెలిపారు.