LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు

నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్‌ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.

LPG price: పెరిగిన సిలిండర్ ధరలపై బీజేపీ ఎంపీ విమర్శలు

Varun Gandhi

LPG price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంటే, మరోవైపు ఎల్పీజీ ధరలు కూడా పెంచుతారా అంటూ ప్రశ్నించారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచుతూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.

SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

‘‘నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్‌ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు. సిలిండర్ కోసం వాడే రెగ్యులేటర్ ధర కూడా రూ.100కు పెంచారు. పేదవాళ్ల వంట గది మళ్లీ పొగతో నిండిపోయింది’’ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ‘‘ఇంత ఖరీదైన ఎల్పీజీ సిలిండర్‌ను ఎవరు కొంటారని మోదీని ప్రశ్నిస్తున్నాం. ఎనిమిదేళ్లలో ఎనిమిది కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్లారు.

Bandi Sanjay: టీఆర్ఎస్ స‌ర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులు

రైతుల రోజువారీ ఆదాయం రూ.27కు పడిపోయింది. ఆర్థిక మాంద్యం కారణంగా గృహిణుల ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో సిలిండర్ ఎలా కొంటారు’’ అని కాంగ్రెస్ ప్రతినిధి రాగిణి నాయక్ విమర్శించారు. గృహ వినియోగానికి వాడే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అలాగే 5 కేజీల సిలిండర్ ధర రూ.18 పెంచారు. మరోవైపు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.8.50 తగ్గించారు.