Bank Alert : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి పని చేయవు

ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్‌ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

Bank Alert : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి పని చేయవు

Bank Alert

Bank Alert : కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అలాగే కొన్ని బ్యాంకులు కూడా విలీనమైపోయాయి. దీంతో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు అనుగుణంగా పలు విషయాల్లో కస్టమర్లను బ్యాంకులు ముందుగానే అలర్ట్ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్‌ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని బ్యాంకు తెలిపింది. దీంతో పాత చెక్‌బుక్స్‌ పని చేయవని వెల్లడించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(OBC), యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(UNI) చెక్ బుక్స్ అక్టోబర్ 1 నుంచి పని చేయవంది. అందుకే ఈ బ్యాంకుల వినియోగదారులు కొత్త చెక్‌ బుక్‌లను పొందాలని కోరింది. లేదంటే చెక్ బుక్ ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

అలాగే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. అందువల్ల పీఎన్‌బీ నుంచి కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కొత్తవి ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. బ్రాంచ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంది. ఏదైనా సందేహాలుంటే 1800 180 2222 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని బ్యాంకు సూచించింది.

Debit Cards : నో నెట్‌వర్క్.. ఆఫ్‌లైన్‌లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!

గతేడాది ఏప్రిల్‌ 1న ఓరియెంటల్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (PNB)లో విలీనం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు బ్యాంకుల పనులన్నీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కింద జరుగుతున్నాయి. దీని ప్రకారం.. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఎంఐసీఆర్‌ కూడా మారిపోయాయి. ఈ రెండు బ్యాంకుల కోడ్‌లు ఇప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కోడ్‌తో కొనసాగనున్నాయి. ఓబీసీ, యూఎన్ఐ ల విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది.