China: చైనాలో మ‌ళ్ళీ క‌రోనా క‌ల‌క‌లం.. లాక్‌డౌన్‌లో కోట్లాది మంది ప్రజలు

చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది ప్ర‌జ‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డిని అరిక‌ట్టేందుకు బుధ‌వారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని, కిరాణా దుకాణాలు, ప‌బ్‌లు, షాపింగ్ మాళ్ళు మూసి ఉంచాల‌ని, ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని చైనా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

China: చైనాలో మ‌ళ్ళీ క‌రోనా క‌ల‌క‌లం.. లాక్‌డౌన్‌లో కోట్లాది మంది ప్రజలు

COVID 19

China: చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది ప్ర‌జ‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఎదుర్కొంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డిని అరిక‌ట్టేందుకు బుధ‌వారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని, కిరాణా దుకాణాలు, ప‌బ్‌లు, షాపింగ్ మాళ్ళు మూసి ఉంచాల‌ని, ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని చైనా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌ధానంగా జియాన్‌, షాంఘైలో క‌రోనా ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేశారు. బుధ‌వారం 300కి పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు చెప్పారు.

Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్ర‌మ్స్ వాయించిన భార్య ల‌త.. వీడియో

క‌రోనా క‌ట్ట‌డికి చైనా అన్ని దేశాల‌లా కాకుండా జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు న‌ష్టం చేకూరుతున్న‌ప్ప‌టికీ కోట్లాది మంది ప్ర‌జ‌ల‌పై చైనా క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. షాంఘైలోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం రేష‌న్ స‌రుకులు అందిస్తోంది. గ‌తంలోనూ షాంఘైలో చైనా ప్ర‌భుత్వం క‌ఠిన‌త‌ర ఆంక్ష‌లు విధించ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌య్యారు. మ‌ళ్ళీ అప్ప‌టి రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని వాపోతున్నారు. క‌రోనాకు క‌ట్ట‌డి చేసేందుకు చైనా ప్ర‌భుత్వం భారీగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయిస్తోంది. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ బీఏ.5.2 వేరియంట్ విజృంభిస్తోందని అక్క‌డి అధికారులు తెలిపారు.