Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్ర‌మ్స్ వాయించిన భార్య ల‌త.. వీడియో

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి థానెలోని సొంత ఇంటికి వ‌చ్చిన ఏక్‌నాథ్ షిండేకు స్వాగ‌తం ప‌లుకుతూ ఆయ‌న భార్య ల‌తా షిండే డ్ర‌మ్స్ వాయించారు.

Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్ర‌మ్స్ వాయించిన భార్య ల‌త.. వీడియో

Latha

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి థానెలోని సొంత ఇంటికి వ‌చ్చిన ఏక్‌నాథ్ షిండేకు స్వాగ‌తం ప‌లుకుతూ ఆయ‌న భార్య ల‌తా షిండే డ్ర‌మ్స్ వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌లే షిండే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి, అనంత‌రం అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌లోనూ నెగ్గిన విష‌యం తెలిసిందే. గ‌త రాత్రి ఆయ‌న థానెలోని ఆనంద్ న‌గ‌ర్‌లోని త‌న ఇంటికి వెళ్ళారు.

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

ఆయ‌న ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఇంటికి వ‌స్తుండ‌డంతో ఆయ‌న‌కు అక్క‌డ పార్టీ శ్రేణులు ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు డ్ర‌మ్స్ వాయించారు. వారితో పాటే ల‌తా షిండే కూడా ఉత్సాహంగా డ్ర‌మ్స్ వాయించి అల‌రించారు. భారీ వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ ఏక్‌నాథ్ షిండే కోసం పార్టీ శ్రేణులు వాన‌లో త‌డుస్తూనే ఎదురుచూశారు. ఆయ‌న రాగానే కారుపూ పూల వ‌ర్షం కురిపించారు. దాదాపు మూడు వారాల క్రితం రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఏక్‌నాథ్ షిండే క్యాంపు ఏర్పాటు చేసి ప‌లు ప్రాంతాల్లో ఉన్నారు. అప్ప‌టి నుంచి నిన్న‌టివ‌ర‌కు ఆయ‌న ఇంటికి వెళ్ళ‌లేదు.