Chinamayi Sripaada : కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి

గాయని చిన్మయి శ్రీపాద తల్లయింది. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు రాహుల్‌ రవీంద్రన్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇద్దరు చిన్నారుల చేతులని తన చేతుల్లోకి తీసుకొని వాటిని ఫోటో తీసి..............

Chinamayi Sripaada : కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి

Rahul Ravindran

Updated On : June 23, 2022 / 9:59 AM IST

Chinamayi Sripaada :  డబ్బింగ్, సింగింగ్ తో ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ ని 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట కవలలకు జన్మనిచ్చారు.

Film Shootings : తలసాని వద్దకు చేరిన సినీ పంచాయతీ..

గాయని చిన్మయి శ్రీపాద తల్లయింది. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు రాహుల్‌ రవీంద్రన్‌ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఇద్దరు చిన్నారుల చేతులని తన చేతుల్లోకి తీసుకొని వాటిని ఫోటో తీసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరికి దృప్త, శర్వస్ అనే పేర్లు పెట్టారు. చిన్నారుల చేతుల ఫోటోలని షేర్ చేసి.. ”దృప్త, శర్వస్… మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చి, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రాహుల్. ఈ విషయం తెలుసుకొని ప్రముఖ సెలబ్రిటీలు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Rahul Ravindran (@rahulr_23)