Chiranjeevi : కృష్ణా జిల్లా డోకిపర్రులో చిరంజీవి.. భార్యతో కలిసి గోదాదేవి కళ్యాణం..

భోగి పండుగ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా డోకిపర్రు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు చిరంజీవి. ఆలయ అర్చకులు........

Chiranjeevi : కృష్ణా జిల్లా డోకిపర్రులో చిరంజీవి.. భార్యతో కలిసి గోదాదేవి కళ్యాణం..

Chiranjeevi

Updated On : January 15, 2022 / 10:56 AM IST

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్నటి నుంచి బిజీబిజీగా ఉన్నారు. నిన్న ఉదయం మెగా ఫ్యామిలీ అంతా సరదాగా భోగి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి రవితేజ ‘రావణాసుర’ సినిమా ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ తర్వాత రాత్రి భార్య సురేఖతో కలిసి చిరంజీవి కృష్ణా జిల్లా డోకిపర్రులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.

మేఘా కన్స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆయన సొంతూరు కృష్ణా జిల్లా డోకిపర్రులో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించారు. అప్పటి నుంచి ఆ ఆలయం పుణ్యక్షేత్రంగా మారింది. రోజూ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. పండగల సమయాలలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిన్న బోగి పండుగ సందర్భంగా సాయంత్రం గోదాదేవి కళ్యాణోత్సవం నిర్వహించారు.

Pawan Kalyan : హరిహర వీరమల్లు.. రెండు విభిన్న పాత్రల్లో పవర్ స్టార్

భోగి పండుగ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా డోకిపర్రు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు చిరంజీవి. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చిరంజీవి దంపతులతో పాటు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా ఈ కల్యాణంలో పాల్గొంది. చిరంజీవి ఈ ఆలయానికి వచ్చారని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు.