CM KCR : సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఈ వారంలోనే ఉద్యోగ నొటిఫికేషన్ ?

తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలోనే తొలి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ పోస్టులపై కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...

CM KCR : సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఈ వారంలోనే ఉద్యోగ నొటిఫికేషన్ ?

Tg Jobs

Job Notification Within This Week : తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలోనే తొలి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ పోస్టులపై కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ గా మంత్రులతో మీటింగ్ పెట్టడం సర్వత్రా ఉత్కంఠ కు తెరలేపింది. అందుబాటులో ఉన్న మంత్రులు ఫామ్ హౌస్ కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పలువురు మంత్రులు ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మొత్తం 9 మంది మంత్రులున్నారు. మంత్రులు హరీశ్ రావు, వేముల, కొప్పుల, గంగుల, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, తలసాని, సబితా ఇంద్రారెడ్డిలున్నారు.

Read More : Telangana CM : మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకు ?

ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ పై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నోటిఫికేషన్ పై మంత్రులతో చర్చిస్తున్నారు. ఈ వారంలోనే తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాఖల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. అంతేగాకుండా.. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ దాడులు.. తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. సిరిసిల్లా జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ – బీజేపీ పార్టీల నేతల మధ్య జరిగిన ఘర్షణపై విచారణ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర నేత గోపి వెపన్ లైసెన్స్ రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డి పేటలో వెపన్ తో భయబ్రాంతులకు గురి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై స్వయంగా ఎస్పీ రాహుల్ హెగ్డే రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.