Huzurabad : నామినేషన్ వేయనున్న గెల్లు శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం కేసీఆర్

ఉపఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస్‌కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బీ-ఫాం అందజేశారు.

Huzurabad : నామినేషన్ వేయనున్న గెల్లు శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం కేసీఆర్

Huzurabad By Poll

Gellu Srinivas Yadav : హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భీఫాం అందింది. ఉపఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస్‌కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బీ-ఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చుల కోసం.. పార్టీ ఫండ్‌ నుంచి 28 లక్షల రూపాయల చెక్కును సీఎం అందజేశారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయని.. టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్నివర్గాల ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ గెల్లు శ్రీనివాస్‌కు సూచించారు.

Read More : Anchor Suma : అలాంటి వాళ్లలో మా ఆయన ఒకరు..

ఆల్‌ ద బెస్ట్‌ అంటూ గెల్లును ఆశీర్వదించారు గులాబీ బాస్‌. ఇక.. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించనున్నారాయన. ఎన్నికల మార్గదర్శకాలు, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. కమలాపూర్‌ నుంచే తన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
హుజూరాబాద్‌లో ఉప పోరు షురూ కానుంది.

Read More :IPL 2021 CSK Vs SRH చెన్నై జైత్రయాత్ర… హైదరాబాద్‌పై విజయం

ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఎనిమిదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉపఎన్నికకు హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని రిటర్నింగ్‌ అధికారిగా నియమించారు. అభ్యర్థులు హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. నామినేషన్‌ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి లేదంటున్నారు అధికారులు.