Pinarayi On Agnipath : అగ్నిప‌థ్‌ను నిలిపివేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం లేఖ‌

అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్ర‌ధానికి లేఖ రాశారు. త‌క్ష‌ణ‌మే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌ని.. యువ‌త‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌పై దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Pinarayi On Agnipath : అగ్నిప‌థ్‌ను నిలిపివేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం లేఖ‌

Pinarayai Vijayan On Agnipath

Pinarayi Vijayan On Agnipath : భార‌త సైన్యంలో నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పథకానికి వ్యతిరేకంగా నిర‌స‌న‌లు వ్యక్తమవుతున్నాయి. యువత రోడ్డెక్కి ఆందోళన బాట పట్టింది. పలు చోట్ల ఆందోళనలు హింసకు దారితీశాయి. రైల్వే ఆస్తులు టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. దీంతో రైల్వేశాఖకు భారీగా నష్టం వాటిల్లుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీమ్ ని ఉద్దేశించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని వాయిదా వేయాలంటూ నేరుగా ప్ర‌ధానికి లేఖ రాశారాయన. త‌క్ష‌ణ‌మే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌ని కోరిన విజ‌య‌న్‌.. యువ‌త‌లో నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌పై దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు పిన‌ర‌యి విజ‌య‌న్.

Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ

కాగా, ఈ ప‌థ‌కంపై తాజాగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ ద‌ళాల అధినేత‌ల‌తో వ‌రుస‌గా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఆదివారం మీడియా ముందుకు వ‌చ్చిన త్రివిధ ద‌ళాల అధిప‌తులు… అగ్నిప‌థ్ ప‌థ‌కంపై వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాకుండా అగ్నివీర్‌ల‌కు ల‌భించే సౌల‌భ్యాల‌ను కూడా వివ‌రించారు.

Priyanka Gandhi: యువత బాధను అర్థం చేసుకోండి.. గతంలో నేను లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు..

ఓ వైపు త్రివిధ ద‌ళాల అధిప‌తులతో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ ఉంటే.. మ‌రోవైపు అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలంటూ కేరళ సీఎం లేఖ రాయడం చర్చకు దారితీసింది.