Sudhakar : కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.. తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇస్తూ..

ఇటీవల సుధాకర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, హాస్పిటల్ లో చేరారని వార్తలు వచ్చాయి. కొంతమంది అయితే సుధాకర్ మరణించాడని కూడా రాశారు. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో డైరెక్ట్ గా సుధాకర్ వాటికి సమాధానమిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

Sudhakar : కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.. తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇస్తూ..

Comedian Sudhakar gives clarity on his health news released a video

Updated On : May 25, 2023 / 3:03 PM IST

Comedian Sudhakar :  ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సుధాకర్ (Sudhakar)గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు సినీ పరిశ్రమకు కూడా సుధాకర్ దూరంగానే ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడి చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నట్టు సమాచారం. కొన్నాళ్ల నుంచి ఎవరికీ అందుబాటులో లేని సుధాకర్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు.

ఇటీవల సుధాకర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, హాస్పిటల్ లో చేరారని వార్తలు వచ్చాయి. కొంతమంది అయితే సుధాకర్ మరణించాడని కూడా రాశారు. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో డైరెక్ట్ గా సుధాకర్ వాటికి సమాధానమిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందరికి నమస్కారం.. నా మీద వచ్చిన వార్తలు ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి, వాటిని స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Malli Pelli : మళ్లీ పెళ్లి సినిమాపై వివాదం.. సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టుకెళ్లిన నరేష్ మూడో భార్య..

అయితే ఈ వీడియోలో సుధాకర్ గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో కమెడియన్ సుధాకర్ ఇంతలా మారిపోయాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సుధాకర్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.