Criminal Laws : క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు

దేశంలో క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన 146వ నివేదిక పేర్కొందని కేంద్రమంత్రి తెలిపారు.

Criminal Laws : క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు

Criminal Laws

Updated On : March 24, 2022 / 9:21 AM IST

Criminal Laws : దేశంలో క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లో సవరణలు తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ రాజ్యసభలో వెల్లడించారు.

సవరణల కోసం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు, వివిధ యూనివర్సిటీలు, లా ఇన్‌స్టిట్యూట్‌, ఎంపీల నుంచి సలహాలు కోరినట్లు ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమమిచ్చారు.

Marital Rape : భార్యపై లైంగిక దాడి కూడా అత్యాచారమే

దేశంలో క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన 146వ నివేదిక పేర్కొందని కేంద్రమంత్రి తెలిపారు. స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన 111వ, 128వ నివేదిక సైతం క్రిమిల్‌ చట్టాల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, 1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, 1872లో సవరణల కోసం మార్పులు చేయడానికి ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించిందని కేంద్రమంత్రి తెలిపారు.