Karnataka: SC, ST లపై స్పెషల్ ఫోకస్.. బీజేపీకి కౌంటర్‭గా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్

ఎస్సీ, ఎస్టీలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వారిని ఒక చోటుకు చేర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్సీల్లో 101 ఉప కులాలు, ఎస్టీల్లో 52 ఉప కులాలు ఉన్నాయి. వారందరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తాం. అందరి సమస్యలు ఒక్కటే. ఒక్కటిగా ఉంటే తొందరలోనే వారి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి

Karnataka: SC, ST లపై స్పెషల్ ఫోకస్.. బీజేపీకి కౌంటర్‭గా భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్

Cong to hold SC/ST meet to counter BJP

Karnataka: గత నెలలో కర్ణాటక భారతీయ జనతా పార్టీ భారీ ఎస్టీ(షెడ్యూల్డ్ ట్రైబ్)లతో భారీ సభ నిర్వహించింది. బళ్లారిలో నిర్వహించిన ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భగవంత్ ఖుబా, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, అరుణ్ సింగ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు హాజరయ్యారు. ఇక దీనికి ముందు అక్టోబరులో కలబురిగిలో బీసీ (బ్యాక్‭వర్డ్ క్లాస్) కులాలతో బహిరంగ సభ నిర్వహించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు ఎస్టీలను తమవైపుకు బీజేపీ తిప్పుకుంటోందని ప్రతిపక్షాల్లో చర్చ మొదలైంది.

Asaduddin Owaisi: ఎవరు గొప్ప హిందువు? నేటి రాజకీయ యుద్ధం ఇదే.. ఓవైసీ విమర్శలు

అయితే బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని చిత్రదుర్ఘలో జనవరి 8న ఎస్సీ, ఎస్టీ (షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రబ్) కులాలతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు పార్టీ తాజాగా ప్రకటించింది. ఈ విషయమై మాజీ ఉప ముఖ్యమంత్రి జీ.పరమేశ్వర స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని, అది జనవరి 8తో మరోసారి రుజువు అవుతుందని అన్నారు.

Sukhvinder Sukhu: చిన్నతనంలో పాలమ్మిన డ్రవైర్ కొడుకు నుంచి నేడు ముఖ్యమంత్రి వరకు.. హిమాచల్ నూతన సీఎం ప్రస్థానం

‘‘ఎస్సీ, ఎస్టీలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వారిని ఒక చోటుకు చేర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్సీల్లో 101 ఉప కులాలు, ఎస్టీల్లో 52 ఉప కులాలు ఉన్నాయి. వారందరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తాం. అందరి సమస్యలు ఒక్కటే. ఒక్కటిగా ఉంటే తొందరలోనే వారి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పిలవాలని అనుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికి పెరిగిన రిజర్వేషన్, ఎస్టీకు 3 నుంచి 7కు పెరిగిన రిజర్వేషన్ బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవానికి అది కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది’’ అని పరమేశ్వర అన్నారు.