Asaduddin Owaisi: ఎవరు గొప్ప హిందువు? నేటి రాజకీయ యుద్ధం ఇదే.. ఓవైసీ విమర్శలు

ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుకు ఉండడం లేదని బీజేపీని ఉద్దేశించి ఓవైసీ ప్రశ్నించారు.

Asaduddin Owaisi: ఎవరు గొప్ప హిందువు? నేటి రాజకీయ యుద్ధం ఇదే.. ఓవైసీ విమర్శలు

Political fight now about who is bigger Hindu than PM Modi: Owaisi

Asaduddin Owaisi: జాతీయ రాజకీయ యుద్ధం ప్రజా సమస్యలపై కాకుండా ‘ఎవరు గొప్ప హిందువు?’ అనే ప్రాతిపదికన కొనసాగుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. నరేంద్రమోదీ కంటే తామే పెద్ద హిందువులమని చూపించుకునేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తాపత్రయ పడుతున్నాయని అన్నారు. శనివారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయమై ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.

మజ్లిస్ పార్టీ ఓట్ కట్టింగ్ పార్టీ అంటుంటారు. అలాగే బీజేపీ బీ-టీం అని కూడా ఆరోపిస్తుంటారు. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూరుస్తున్నారని దాని అర్థం వాస్తవం ఏంటంటే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 183 సీట్లకు గాను ఎంఐఎం పోటీ చేసింది కేవలం 13 స్థానాల్లోనే. మిగతా ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ ఇంతే ఉంటుంది. కాగా, గుజరాత్ ఎన్నికల్లో ఈ ఆరోపణపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బీజేపీ, కాంగ్రెస్, ఆప్.. మూడు పార్టీలూ హిందుత్వ పార్టీలే. ముస్లిం ఓట్లతో వారికి సంబంధం లేదు. హిందువుల ఓట్లతో బీజేపీ గెలిచింది. ఆ హిందువుల ఓట్ల కోసమే కాంగ్రెస్, ఆప్ పోటీపడ్డాయి. మోదీ కంటే తామే పెద్ద హిందువు అని నిరూపించుకునేందుకే రాజకీయ యుద్ధం చేస్తున్నాయి’’ అని అన్నారు.

S Jaishankar: పాక్-ఇండియాల మధ్య క్రికెట్ సంబంధాలు మారుతున్నాయా?.. మంత్రి జయశంకర్ ఏమన్నారంటే?

మూడూ హిందూ పార్టీలే కానీ, కొన్ని పార్టీలు బయటికి కనిపిస్తుంటే, మరికొన్ని కనిపించడం లేదని ఓవైసీ అన్నారు. అలాగే కేరళ, తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ రాలేదని ఓవైసీ తేల్చి చెప్పారు. ఇక నలుగురు భార్యలు ఉండకూడదంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ ‘‘శబరిమలలోకి మహిళలను అనుమతి ఇవ్వమని నేను చాలెంజ్ చేస్తున్నాను. ఇవ్వరు అంటే ఎందుకు ఇవ్వరు? మీ సంప్రదాయం అయితే సంప్రదాయం కానీ మాది కాదా?’’ అని ప్రశ్నించారు.

ముస్లిం వ్యక్తుల భార్యలకు ఆస్తిలో అన్ని హక్కులు ఉంటయని, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా వర్తిస్తాయని ఓవైసీ అన్నారు. ఒకవైపు యూనిఫాం సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూనే మరొక వైపు లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారని, ఏదైనా ఒక స్టాండ్ మీద ఎందుకు ఉండడం లేదని బీజేపీని ఉద్దేశించి ఓవైసీ ప్రశ్నించారు.

Bangladesh: బంగ్లా జాతీయ ఎన్నికల ముందు భారీ నిరసన.. ప్రభుత్వం ముందు 10 డిమాండ్లు