S Jaishankar: పాక్-ఇండియాల మధ్య క్రికెట్ సంబంధాలు మారుతున్నాయా?.. మంత్రి జయశంకర్ ఏమన్నారంటే?

ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బాధితులు గొంతు విప్పకపోతే ఒత్తిడి రాదు. ఉగ్రవాదం వల్ల భారత్ ఎంతగానో నెత్తురోడింది. కాబట్టి దీనికి భారత్ దారి చూపుతుంది

S Jaishankar: పాక్-ఇండియాల మధ్య క్రికెట్ సంబంధాలు మారుతున్నాయా?.. మంత్రి జయశంకర్ ఏమన్నారంటే?

Will cricket ties change between India, Pakistan?

S Jaishankar: పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య ఉండే సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దు వివాదం ఇరు దేశాల మధ్య చిచ్చు పెడితే ఉగ్రవాదం దాన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ రెండు అంశాలు ఎంతకీ ముగియడం లేదు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు గాలిలో మేడలలాగే మిగిలిపోతున్నాయి. ఏ సందర్భంలోనూ ఇరు దేశాల మధ్య దౌత్యం లేదు కానీ, ఒక్క క్రికెట్ మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లనైనా కాసేపైనా దగ్గర చేస్తుంది. అయితే కొంత కాలంగా క్రికెట్‭లో కూడా కొన్ని మార్పులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. పాక్ టూర్ అంటేనే భారత్ దూరంగా ఉంటోంది. అలాగే ఆ దేశంతో ఆట కూడా కష్టంగానే మారింది.

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్!

అయితే ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‭ని ప్రశ్నించింది మీడియా. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అందులో భాగంగా ‘‘మీ తలపై గన్ పెట్టిన వారితో మీరు చర్చలు చేస్తారా?’’ అని అని ప్రశ్నించగా ‘‘మీరు (పాకిస్తాన్‭ను ఉద్దేశించి) అంత బహిరంగంగానే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంటే ఎలా మాట్లాడతాం? ఉగ్రవాదం బారి నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలన్నదే మా లక్ష్యం. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో అనూహ్య పరిస్థితి నెలకొంది. అయితే వారు ఉగ్రవాద మార్గాన్ని విడిచిపెడతారని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

Bangladesh: బంగ్లా జాతీయ ఎన్నికల ముందు భారీ నిరసన.. ప్రభుత్వం ముందు 10 డిమాండ్లు

ఇక ఇరు దేశాల మధ్య సంబంధాల కారణంగా క్రికెట్ సంబంధాలు కూడా మారుతున్నాయా? అన్న ప్రశ్నకు జయశంకర్ సమాధానం ఇస్తూ ‘‘క్రికెట్ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బాధితులు గొంతు విప్పకపోతే ఒత్తిడి రాదు. ఉగ్రవాదం వల్ల భారత్ ఎంతగానో నెత్తురోడింది. కాబట్టి దీనికి భారత్ దారి చూపుతుంది’’ అని అన్నారు.