Bharat Jodo Yatra: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మరో ‘భారత్ జోడో యాత్ర’: కాంగ్రెస్ నేత

ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉత్తరాది వైపుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి తెలిపారు. ఆయన ప్రస్తుతం భారత్ జోడో యాత్ర రాజస్థాన్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

Bharat Jodo Yatra: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మరో ‘భారత్ జోడో యాత్ర’: కాంగ్రెస్ నేత

Bharat Jodo Yatra: ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉత్తరాది వైపుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి తెలిపారు. ఆయన ప్రస్తుతం భారత్ జోడో యాత్ర రాజస్థాన్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

‘‘తూర్పు నుంచి పశ్చిమ వరకు ర్యాలీ నిర్వహించాలని కూడా ప్రతిపాదన ఉంది. అందుకు రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నాం. లోక్ సభ ఎన్నికల ముందు ఈ ర్యాలీ ఉంటుంది’’ అని మీడియాకు తెలిపారు. భారత్ జోడో యాత్రను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. దీని ద్వారా దేశ సామరస్యతను పెంపొందిస్తున్నామని అన్నారు.

దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలనూ లేవనెత్తుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబరు మొదటి వారంలో రాజస్థాన్ లోకి ప్రవేశిస్తుందని అన్నారు. అలాగే, అల్వార్ జిల్లా మలాఖేడాలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..