Congress MLC Jeevan Reddy: కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది.. 2000 నోట్ల రద్దుపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికే తెలంగాణ వచ్చినట్టు ఉందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.

Congress MLC Jeevan Reddy: కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది.. 2000 నోట్ల రద్దుపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

Congress MLC Jeevan Reddy

Congress MLC Jeevan Reddy: కేసీఆర్ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత 111 జీవో పరిధిలో జరిగిన భూ బదిలీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 111 జీవో రద్దుతో లాభపడేది రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమేనని అన్నారు. 111 జీవోపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.

Jeevan Reddy : తూకం వేయడం లేదు, లారీలు రావడం లేదు- ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

రాష్ట్రాన్ని ఏవిధంగా అమ్మకానికి పెట్టాలో అనే విషయం సోమేష్ కుమార్ ఆలోచిస్తున్నాడని, 111 జీవో పరిధిలోని భూముల అమ్మకాలు ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యాయంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పైసా ఖర్చులేకుండా వచ్చే నీళ్లను పక్కన పెట్టి, కాళేశ్వరం నుండి నీళ్ళు తెస్తా అనడం ఎంటో అంటూ జీవన్ రెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆదాయం పొందాలనే తపన తప్పా, ప్రజల జీవితాల గురించి పట్టించుకోవడమే లేదని విమర్శించారు. జంట జలాశయాలను నిర్వీర్యం చేయడం క్షమించరాని నేరం అని అన్నారు.

China Boycott G20 Meetings: శ్రీనగర్‌లో జరిగే జీ20 సమావేశాన్ని చైనా బహిష్కరించింది.. కారణమేమిటంటే?

111 జీవో పరిధిలో ఫాంహౌజ్ కట్టుకుంటేనే పెద్ద లీడర్ అనేలాగా పరిస్థితి తయారైందని, బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌజ్‌లు కట్టుకోవడానికే తెలంగాణ వచ్చినట్టు ఉందంటూ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. సోమేష్ కుమార్ రావడంతోనే 111 జీవో రద్దు అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే సలహాలు ఇవ్వడానికే సోమేష్ కుమార్ వచ్చినట్టున్నాడు. 111జీవో పరిధిలో 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆరు నెలల్లో తెలంగాణని వీలైనంత అమ్మడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ ఆరోపించారు.

Karnataka CM Swearing: సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే.. జాబితా విడుదల చేసిన అధిష్టానం

2000 నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. నేను 2వేల నోటు చూడక రెండు మూడు నెలలు అవుతోంది. నేను ఎప్పుడు ఏటీఏంకి వెళ్లి డబ్బులు డ్రా చేసినా 500 నోట్లే వస్తున్నాయి. 2000 ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. కేసీఆర్‌కి మెమోరీ లాస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ జ్ఞాపక శక్తి కోల్పోయాడు. కేసీఆర్ ఏమేం మాట్లాడాడో గుర్తు రావాలంటే పాత వీడియో రికార్డులు చూడాలి అంటూ జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. దళితులు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొని అమ్మకానికి పెడుతున్నాడంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు.