Vice President election: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ య‌త్నాలు

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక ఆగ‌స్టు 6న జ‌ర‌గ‌నుంది.

Vice President election: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ య‌త్నాలు

Congress

Vice President election: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక ఆగ‌స్టు 6న జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్ నిన్న‌ విడుద‌లైంది. జూలై 19 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను పార్టీ ఎంపీ మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు అప్ప‌గించింది.

AIADMK: ఎంజీఆర్, జ‌య‌ల‌లితలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాల‌నుకుంటున్నాను: శ‌శిక‌ళ‌

త్వ‌ర‌లోనే దీనిపై కాంగ్రెస్ త్వ‌ర‌లోనే ఓ స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. ఎన్నిక‌లో ఎవ‌రిని నిల‌బెట్టాల‌నే విష‌యంపై ‘ప‌రిశీల‌నలో ఉంచాల్సిన‌ అభ్య‌ర్థుల’తో కూడిన జాబితాను రూపొందించాల‌నుకుంటోంది. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు త‌మ పార్టీ నుంచి మాత్ర‌మే అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని తాము అనుకోవట్లేద‌ని, ఏ పార్టీ నుంచి అయినా స‌రే బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని భావిస్తున్నామ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం విప‌క్షాల నుంచి ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో ఏకాభిప్రాయం కోసం ప్ర‌య‌త్నించాల్సి ఉంద‌ని చెప్పాయి. కాగా, ఆగస్టు 10తో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ముగియ‌నుంది. ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య నాయుడు 2017 ఆగ‌స్టు 11 నుంచి కొన‌సాగుతున్నారు.