3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 05:37 AM IST
3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయం సాధించగా,కొందరు మాత్రం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారు.. కనీసం సొంత కుటుంబీకుల కడచూపును కూడా నోచుకోలేకపోతున్నారు.

ఈ వైరస్ ప్రజల ఆరోగ్యంపైనే కాదు.. దేశాల ఆర్ధిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కోవిడ్-19 వైరస్‌ కు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు,మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. భారత్ లో కేసుల సంఖ్య 78వేలు దాటగా,మరణాల సంఖ్య 2,550కి చేరుకుంది. 

ఇక,ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4,429,930 కేసులు నమోదవగా,298,174 మంది కరోనా సోకి మరణించారు.1,659,806మంది కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,471,950 యాక్టివ్ కోవిడ్-19 కేసులున్నాయి.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి.

ఇప్పటివరకు యూఎస్ లో 1,430,348 కేసులు నమోదవగా, 85,197 మరణాలు నమోదయ్యయి. 3 లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమెరికా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా బ్రిటన్ లో నమోదయ్యాయి. బ్రిటన్ లో 33,186 కరోనా మరణాలు నమోదవగా,ఆ తర్వాత అధికంగా ఇటలీలో 31,106మరణాలు నమోదయ్యాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న స్పెయిన్ లో 27,104మరణాలు నమోదయ్యయి. ఫ్రాన్స్ లో 27,074కరోనా మరణాలు నమోదయ్యయి. ఇక బ్రూనై,గాంబియా,బురిండి వంటి కొన్ని దేశాల్లో ఈ వ్యాధితో ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
 

Read More:

కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ హ్యాక్ చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది.. అమెరికా ఆరోపణ

HIV లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదు, బాంబు పేల్చిన WHO