Kejriwal: స‌త్యేందర్ జైన్‌ను చూసి దేశం గ‌ర్వించాలి.. ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలి: కేజ్రీవాల్

న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఇది రాజ‌కీయ కుట్రేనంటూ మండిప‌డ్డ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆయ‌న‌పై మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు.

Kejriwal: స‌త్యేందర్ జైన్‌ను చూసి దేశం గ‌ర్వించాలి.. ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలి: కేజ్రీవాల్

Kejriwal

Kejriwal: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఇది రాజ‌కీయ కుట్రేనంటూ మండిప‌డ్డ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆయ‌న‌పై మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు. ఢిల్లీలో బుధ‌వారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. స‌త్యేందర్ జైన్ చాలా నిజ‌యితీప‌రుడ‌ని, దేశ భ‌క్తుడ‌ని చెప్పారు. ఆయ‌న‌ను చూసి దేశ గ‌ర్వ‌ప‌డాల‌ని, ఢిల్లీలో మొహ‌ల్లా క్లినిక్ మోడ‌ల్‌ను ఇచ్చార‌ని చెప్పారు.

Congress: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా, రాహుల్‌కు స‌మ‌న్లు

మొహ‌ల్లా క్లినిక్‌ను ఐక్య‌రాజ్య స‌మితి మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కూడా సంద‌ర్శించార‌ని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరోగ్య మోడ‌ల్ ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వైద్యం అందిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. స‌త్యేందర్ జైన్‌కు ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్ వంటి అవార్డులు ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. కాగా, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రితో పాటు విద్యుత్తు, హోం శాఖల బాధ్య‌త‌లూ సత్యేందర్ జైన్ నిర్వ‌ర్తిస్తున్నారు. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఆయ‌న‌ను జూన్ 9 వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌త్యేందర్ జైన్‌ను కేజ్రీవాల్ కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.