Congress: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా, రాహుల్‌కు స‌మ‌న్లు

నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది.

Congress: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా, రాహుల్‌కు స‌మ‌న్లు

Sonia Rahul

Congress: నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసులో గురువారం రాహుల్ గాంధీ, జూన్ 8న సోనియా గాంధీ త‌మ మందు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఈడీ ఆదేశించింది.

Smriti Irani: కేజ్రీవాల్‌జీ ఇలాంటి వ్య‌క్తిని మంత్రి ప‌ద‌విలో కొన‌సాగిస్తారా?: స్మృతి ఇరానీ

దీనిపై కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ… నేష‌న‌ల్ హెరాల్డ్ పేప‌ర్‌ను 1942లో ప్రారంభించార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో బ్రిటిష్ ప్ర‌భుత్వం దాన్ని అణ‌గ‌దొక్కాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని, ఇప్పుడు ప్ర‌ధాని మోదీ స‌ర్కారూ అదే ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అందుకోసం ఈడీని కేంద్ర స‌ర్కారు ఉప‌యోగించుకుంటోంద‌ని ఆరోపించారు. అందుకే ఈడీ నోటీసులు పంపింద‌ని చెప్పారు.

Pakistan: పాక్ ప్ర‌జ‌ల‌కు షాక్.. వంట నూనె ధ‌ర లీట‌రుకు రూ.208 పెంపు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు పంప‌డం ప‌ట్ల కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ కూడా స్పందించారు. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ జ‌రిగింద‌ని చెప్ప‌డానికి ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ లేవ‌ని చెప్పారు. రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే సోనియా, రాహుల్‌పై బీజేపీ ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని చెప్పారు. దేశంలో పెరిగిపోతోన్న ద్ర‌వ్యోల్బ‌ణం, ఇత‌ర స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.