Court Orders Zomato: ఆర్డర్ డెలివరీ చేయలేదని జొమాటోపై కేసు వేసిన లా స్టూడెంట్.. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?

తను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేయలేదని జొమాటో సంస్థపై కేసు వేశాడు ఒక లా స్టూడెంట్. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం చెల్లించాలని జొమాటోను ఆదేశించింది.

Court Orders Zomato: ఆర్డర్ డెలివరీ చేయలేదని జొమాటోపై కేసు వేసిన లా స్టూడెంట్.. కోర్టు తీర్పు ఏంటో తెలుసా?

Court Orders Zomato: తను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేయలేదని ఒక లా స్టూడెంట్ జొమాటోపై కేసు వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ ఆఫ్ డిల్లీలోని, ‘ఫ్యాకల్టీ ఆఫ్ లా’లో అరుణ్ జి.కృష్ణన్ అనే వ్యక్తి లా చివరి సంవత్సరం చదువుతున్నాడు.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

అతడు కేరళ, తిరువనంతపురంలో ఉన్నప్పుడు జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. దీనికి ముందుగానే రూ.362 చెల్లించాడు. అయితే, అతడికి ఫుడ్ డెలివరీ చేయలేదు. అలాగని డబ్బులు కూడా రీఫండ్ చేయలేదు. దీనిపై అతడు జొమాటోకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అరుణ్‌కు అతడు చెల్లించిన రూ.362తోపాటు నష్ట పరిహారం కింద రూ.5,000, కోర్టు ఖర్చుల కింద రూ.3,000 కలిపి మొత్తం రూ.8,362 చెల్లించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా దీనిపై జొమాటో అభ్యంతరం వ్యక్తం చేసింది. డెలివరీ చేసే విషయంలో తమ పొరపాటు ఏమీ లేదని వ్యాఖ్యానించింది.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

డెలివరీ అడ్రస్ సరిగ్గా లేదని, ఫుడ్ డెలివరీ చేసేందుకు అతడిని సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదని జొమాటో కోర్టుకు తెలిపింది. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అరుణ్‌కు నిర్దేశించిన మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, అరుణ్.. తనకు నష్ట పరిహారం కింద రూ.1.5 లక్షలు, కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించేలా ఆదేశించాలని కోరాడు. కానీ, దీనికి నిరాకరించిన కోర్టు రూ.8.632 మాత్రమే చెల్లించేలా జొమాటోను ఆదేశించింది.