NTR 100 Years : నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చిన కరాటే కళ్యాణి.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కోర్ట్ స్టే..

ఖమ్మంలో శ్రీకృషుణుడి రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ కోర్ట్ కి వెళ్లిన కరాటే కళ్యాణి.. విగ్రహావిష్కరణ పై కోర్ట్ స్టే తీసుకు వచ్చింది.

NTR 100 Years : నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చిన కరాటే కళ్యాణి.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కోర్ట్ స్టే..

court stay order on NTR Statue in Khammam karate kalyani

NTR 100 Years : నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకకు సందర్భంగా మే 28న ఖమ్మంలో (Khammam) 54 అడుగులు ఎత్తులో శ్రీకృషుణుడి రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహిస్తున్న ఈ విగ్రహావిష్కరణ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లబోతున్నాడు. దీంతో ఆ కార్యక్రమం కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక వివాదం మొదలైంది. సినీ నటి కరాటే కళ్యాణి విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

NTR 100 Years : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై ముదురుతున్న వివాదం.. కరాటే కళ్యాణితో తలసాని భేటీ, మంచు విష్ణు నోటీసులు!

ఎన్టీఆర్ విగ్రహం అంటూ శ్రీకృషుడి రూపంలో ఉన్న విగ్రహం పెడుతున్నారంటూ. ఎన్టీఆర్ గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. కానీ భగవంతుడి కంటే ఎక్కువ కాదని ఆమె వెల్లడించింది. విగ్రహ రూపం మార్చాలని, లేకుంటే ధ్వంసం చేయడానికి కూడా సిద్ధమని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas), మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించి.. ఆందోళన విరమించాలని కోరారు.

NTR 100 Years : ఎన్టీఆర్ మహానటి సావిత్రిని ఏమని పిలిచేవారో తెలుసా?

కానీ కళ్యాణి మాత్రం వారి సూచలను తిరస్కరించి కోర్టుని ఆశ్రయించింది. నేడు విచారణ జరిపిన కోర్ట్.. విగ్రహావిష్కరణ పై స్టే విధించింది. ఈ విషయం పై తుది తీర్పు వచ్చే వరకు విగ్రహావిష్కరణ నిలిపివేయాలని, సమ్మర్ హాలిడేస్ అయిన తరువాత ఈ కేసు పై తీర్పుని ఇస్తామంటూ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో విగ్రహావిష్కరణ ప్రస్తుతం నిలిచి పోయింది. మరి నిర్వాహుకులు విగ్రహావిష్కరణను నిలిపివేస్తారా లేదా పై కోర్ట్ ని ఆశ్రయిస్తారా అనేది చూడాలి. ఇక ఈ తీర్పు నందమూరి అభిమానులను షాక్ కి గురి చేసింది.