NTR 100 Years : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై ముదురుతున్న వివాదం.. కరాటే కళ్యాణితో తలసాని భేటీ, మంచు విష్ణు నోటీసులు!
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు పై మంత్రి తలసాని శ్రీనివాస్, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.

Manchu Vishnu Talasani Srinivas reaction on Karate Kalyani comments of NTR
100 Years of NTR : నందమూరి తారక రామారావు శత జయంతి ఈ ఏడాది జరుగుతుంది. దీంతో ఆ జయంతిని ఒక ఉత్సవంలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), హీరో బాలకృష్ణ (Balakrishna).. గత ఏడాది నుంచి ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఈ శత జయంతి సందర్భంగా మే 28న ఖమ్మంలో (Khammam) 54 అడుగులు ఎత్తులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతుంది.
ఈ విగ్రహావిష్కరణ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లబోతున్నాడు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పనులు చూసుకుంటున్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అనుకుంటే పెట్టండి, కానీ దేవుడి రూపంలో పెట్టడం కరెక్ట్ కాదని తెలిపింది. అభిమాన నటుడైనా భగవంతుడి కంటే ఎక్కువ కాదని, విగ్రహ రూపం మార్చాలని, లేకుంటే ధ్వంసం చేయడానికి కూడా సిద్ధమని ఇటీవల సంచలన కామెంట్స్ చేసింది.
NTR : ఎట్టకేలకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్న జూనియర్..
అంతేకాదు ఏపీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర హిందూ సంఘాలతో నిరసన కూడా చేపట్టారు. దీంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదమైంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ పై కళ్యాణి చేసిన వ్యాఖ్యలు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అయ్యాడు. ఆమె చేసిన వ్యాఖ్యలు పై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) కూడా ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు. ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళన విరమించాలని తలసాని కల్యాణికి సూచించారు. కానీ కళ్యాణి మంత్రి సూచలను తిరస్కరించింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు చేరుకుంటుందో చూడాలి.