Covaxin : 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. DCGI అనుమతి!

Covaxin Vaccine : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ (Covaxin)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI) అనుమతినిచ్చింది.

Covaxin : 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. DCGI అనుమతి!

Covaxin Cleared For Kids Aged 6 To 12 Years, Bharat Biotech Asked To Keep Submitting Safety Data

Covaxin  : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ (Covaxin)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI) అనుమతినిచ్చింది. అతి త్వరలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లలకు కోవాక్సిన్‌ (Covaxin)ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి DCGI నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా( DCGI)కి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం DCGI అధికారిక ప్రకటనతో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత్లో 12 ఏళ్ల పైబడిన పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే మార్చి 16 నుంచి 12 ఏళ్ల పైబడిన వారికి భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 12-14 ఏళ్ల వయస్సు గల పిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి ఆరేళ్ల చిన్నారులు మినహా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు DCGI అనుమతినిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Covaxin Cleared For Kids Aged 6 To 12 Years, Bharat Biotech Asked To Keep Submitting Safety Data (1)

Covaxin Cleared For Kids Aged 6 To 12 Years, Bharat Biotech Asked To Keep Submitting Safety Data

ఈ నేపథ్యంలోనే ఆరేళ్ల నుంచి 12ఏళ్ల లోపు చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించనుంది. ఇప్పటికే ఆరేళ్ల నుంచి 12ఏళ్ల చిన్నారులపై కరోనా వ్యాక్సిన్ పనితీరుపై పరీక్షించారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో భారత్ బయోటెక్ ఆ డేటాకు సంబంధించిన నివేదికను DCGIకి పంపింది. దాని ఆధారంగానే DCGI ఆరేళ్ల నుంచి 12ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అనుమతినిచ్చింది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు టీకాలు అందించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 45 ఏళ్ల పై బడిన వారికి టీకాను అందించారు. గత ఏడాది మే 1 నుంచి 18 ఏళ్లుపై బడిన అందరికి కరోనా వ్యాక్సిన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి 2022 జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.

Read Also : Covaxin : కొవాగ్జిన్ రెండు డోస్ లు వేసుకున్నారా..? అయితే మీరు ఫుల్ సేఫ్!