COVID: దేశంలో భారీగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి.

COVID-19
COVID: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,19,457 మందికి చికిత్స అందుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే 4,245 పెరిగింది.
Maharashtra: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వద్ద భారీగా నిలిచిన వర్షపు నీరు
రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,29,21,977కి పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 5,25,305కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 198,33,18,772 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. నిన్న 11,44,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2కి ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి కూడా జరుగుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.