Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద భారీగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీరు

మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద‌ వ‌ర్ష‌పు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్య‌మంత్రి ఇంటి ముందే ప‌రిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్ర‌జ‌ల ఇళ్ళ వ‌ద్ద ఎలా ఉంటుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద భారీగా నిలిచిన‌ వ‌ర్ష‌పు నీరు

Maharashtra

Maharashtra: మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇంటి వ‌ద్ద‌ వ‌ర్ష‌పు నీరు భారీగా నిలిచింది. దీంతో ముఖ్య‌మంత్రి ఇంటి ముందే ప‌రిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్ర‌జ‌ల ఇళ్ళ వ‌ద్ద ఎలా ఉంటుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇన్నాళ్ళు మ‌హారాష్ట్ర మంత్రిగా కొన‌సాగిన ఏక్‌నాథ్ షిండే ఇటీవ‌ల ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌ రెండు రోజుల క్రిత‌మే తొలిసారి ఏక్‌నాథ్ షిండే థానెలోని లూయిస్ వాడీలోని త‌న సొంత ఇంటికి వెళ్ళారు.

Google: అంకుర సంస్థ‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్

గత రాత్రి థానెలో భారీగా వ‌ర్షం కురిసింది. ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద నీరు నిల‌వ‌డంతో ఇవాళ ఉద‌యం 6.15 గంట‌ల‌కు స్థానిక‌ మునిసిప‌ల్ సిబ్బందికి ముఖ్య‌మంత్రి సిబ్బంది ఫోన్ చేశారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న మునిసిప‌ల్ సిబ్బంది స్థానికంగా నిలిచిన వ‌ర‌ద నీటిని తొల‌గించారు. కాగా, థానెలోని ప‌లు ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిప‌డ్డాయి. ఓ పాఠ‌శాల ప్ర‌హారీ గోడ కూలిపోయింది. భారీ వర్షంతో థానె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.