CPM Brinda Karat : జహంగీర్ పురిలో కూల్చివేతలను అడ్డుకున్న సీపీఎం నాయకురాలు బృందా కారత్

సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPM Brinda Karat : జహంగీర్ పురిలో కూల్చివేతలను అడ్డుకున్న సీపీఎం నాయకురాలు బృందా కారత్

Brinda Karat

CPM Brinda Karat : జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు నిలిచిపోయింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అక్రమ నిర్మాణాల తొలగింపు నిలిచిపోయింది. కోర్టు ఉత్తర్వులు అధికారికంగా అధికారులకు చేరుకోకపోవడంతో గంటన్నర పాటు కూల్చివేతలు సాగాయి. కొనసాగుతున్న కూల్చివేతలను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అడ్డుకున్నారు.

సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ డిపేంద్ర పాఠక్ ని కలిసి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల గురించి బృందా కారత్ వివరించారు.

Jaishankar: భారత్‌పై రష్యా మంత్రి ప్రశంసలు

జేసీబీ, బుల్డోజర్లు నిలిచిపోయాయని, కూల్చివేతలు కొనసాగవని డిపేంద్ర పాఠక్ హామీ ఇచ్చారు. జహంగీర్ పురిలో కోర్టు ఆదేశాలతో నిర్మాణాల తొలగింపు నిలిచిపోయిందన్నారు. జహంగీర్ పురి వాసులు సంయమనంతో ఉండాలని సూచించారు.