Jaishankar: భారత్‌పై రష్యా మంత్రి ప్రశంసలు

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్, తన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లారోవ్.

Jaishankar: భారత్‌పై రష్యా మంత్రి ప్రశంసలు

Crude oil imports from Russia

Jaishankar: ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్, తన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లారోవ్. మరోవైపు భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్.జైశంకర్‌పై కూడా సెర్జీ ప్రశంసలు కురిపించారు. జైశంకర్ నిజమైన దేశ భక్తుడని, గొప్ప దౌత్యవేత్త అని అభివర్ణించారు. సెర్జీ మంగళవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.

Russia – India: రష్యాకు ఎగుమతులు పునరుద్ధరించిన భారత్: ఇరు దేశాల కరెన్సీతోనే చెల్లింపులు

ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్ కూడా అలాగే చేయాలని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెచ్చాయి. రష్యా నుంచి దిగుమతులు ఆపేయాలని కూడా భారత్‌కు సూచించాయి. అయితే, మన దేశం అలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. మన దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించింది. ముఖ్యంగా రష్యాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘‘మేం మా దేశం కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా నిర్ణయాలు దేశ భద్రత, అభివృద్ధికి ఉపయోగపడేలా మాత్రమే ఉంటాయి’’ అని జై శంకర్ అంతర్జాతీయ వేదికగా ప్రకటించారు.

Ukraine russia war : లివివ్‌పై రష్యా సైన్యం క్షిపణుల వర్షం.. జెలెన్ స్కీ ఏం చేశాడంటే..

ఈ విషయంపైనే రష్యా విదేశాంగ మంత్రి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలా ఏ దేశమూ బహిరంగంగా చెప్పలేదని సెర్జీ అన్నారు. ‘‘భారత్ మాకు ఎంతో మిత్ర దేశం. ఒకప్పుడు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు భారత్‌ను ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నాం’’ అని సెర్జీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ ప్రతిపాదనను కూడా సెర్జీ సమర్ధించారు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అనేక రష్యన్ ఉత్పత్తుల్ని భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌కు ఎలాంటి సహకారం అందించేందుకైనా రష్యా సిద్ధంగా ఉందన్నారు.