Uttarakhand: జోషిమఠ్‌లోనే కాదు.. కర్ణప్రయాగ్ నగరంలోనూ ఇళ్లకు పగుళ్లు.. భయంగుప్పిట్లో ప్రజలు
జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణ ప్రయాగ్‌లోనూ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం జోషిమఠ్‌కు 80 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ 50 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు.

Uttarakhand
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమిగా పేరుపొందిన జోషిమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఉన్నట్లుండి ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చి కూలిపోతున్నాయి. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుడుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 650కిపైగా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో నివాసదారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలాఉంటే పలు తీవ్రంగా పగుళ్లు వచ్చి కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో 561 ఇళ్లకు పగుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
పగుళ్లు వచ్చిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేసేందుకు మంగళవారం అధికారులు చర్యలు చేపట్టారు. తొలిరోజు రెండు హోటళ్లు కూల్చివేశారు. వాటిలో జోషిమఠ్ హోటల్ మలారి ఇన్, హోటల్ మౌంట్ వ్యూ లు ఉన్నాయి. అయితే పగుళ్లువచ్చి కూలేప్రమాదమున్న ఇళ్లు, హోటళ్లను కూల్చివేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే భూమిలో ఏర్పడిన మార్పులకారణంగా వస్తున్న పగుళ్లతో జోషిమఠ్ లో మాత్రమే కాకుండా మరో ప్రాంతంలోనూ ఇళ్లకు పగుళ్లు, నేల నెర్రెలుబారడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణ ప్రయాగ్‌లోనూ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం జోషిమఠ్‌కు 80 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ 50 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సింతర్గాంజ్ ఎమ్మెల్యే సౌరభ్ బహుగుణ మాట్లాడుతూ.. జోషిమఠ్ తరహాలోనే ఇతర గ్రామాల్లోనూ ఈ సమస్య తలెత్తుతుందని, ప్రభుత్వ పరంగా స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నివిధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.
https://twitter.com/ANINewsUP/status/1612649561365049344?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612649561365049344%7Ctwgr%5E7ccab9f015c87cd2b32e5c2b6b2d4e760d68ed60%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Findia-news%2Famid-joshimath-crisis-cracks-appear-on-houses-in-uttarakhand-s-karnaprayag-watch-101673323707668.html