Crazy Combinations: బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్.. ఈసారి అంతకు మించి!

హీరో, మేకర్స్ మధ్య ర్యాపొ కుదిరితే వెంట వెంటనే సినిమాలు కొందరు ప్రకటిస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టవుతుంటాయి. ఇవి బంపర్ హిట్ కాంబోస్ కాబట్టి.. ఆటోమేటిక్ గా..

Crazy Combinations: బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్.. ఈసారి అంతకు మించి!

Crazy Combinations

Crazy Combinations: హీరో, మేకర్స్ మధ్య ర్యాపొ కుదిరితే వెంట వెంటనే సినిమాలు కొందరు ప్రకటిస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టవుతుంటాయి. ఇవి బంపర్ హిట్ కాంబోస్ కాబట్టి.. ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ కూడా హైలో ఉన్నాయి. ఇంకొంతమందైతే త్వరలో కలిసొస్తామంటూ ఇప్పటి నుంచే ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నారు.

Rowdy Boys: లవ్, రొమాన్స్, కాలేజ్ ఫైట్స్.. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్!

సంక్రాంతికి పండుగ లాంటి సినిమా తీసుకొస్తున్నాం అంటున్నారు బంగార్రాజు టీమ్. సోగ్గాడే చిన్ని నాయనతో నాగ్ కి సూపర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కల్యాణ్ కురసాల. బంగార్రాజు స్టోరీ పట్టుకుని కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. చివరికి అక్కినేని తండ్రీకొడుకలతో మినిమం టైమ్ లో షూటింగ్ కానిచ్చేసి సంక్రాంతికి రిలీజ్ కూడా చేసేస్తున్నాడు. ఈ పండక్కి పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పన్ కావడంతో నాగ్ – కల్యాణ్ కాంబోపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు ఆడియెన్స్.

Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?

సింహా, లెజెండ్ తర్వాత అఖండ ఇచ్చిన బూస్టప్ మామూలుగా లేదు. బోయపాటి – బాలయ్య కాంబో అంటే కిర్రాకే అని తేల్చేసింది. అందుకే బోయపాటితో సినిమాలు వస్తూనే ఉంటాయన్నారు బాలకృష్ణ. మరోవైపు త్వరలో అఖండ సీక్వెల్ ఉండొచ్చనే హింట్స్ ఇస్తున్నారు. అఖండ2 తీయాలనుందని నిర్మాత స్వయంగా ప్రకటించారు కూడా. పుష్ప తర్వాత బన్నీ కలిసొచ్చేది బోయపాటితోనే అన్నది దాదాపు కన్ఫర్మయినట్టే. సరైనోడు మ్యాసివ్ హిట్ తర్వాత రాబోతున్న స్టార్ కాంబినేషన్ వీళ్లది. ఐకాన్ స్టార్ తో బోయపాటి పీరియాడికల్ ఫిల్మ్ ప్లాన్ చేశారని.. అది పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?

రంగస్థలం.. చిట్టిబాబుగా రామ్ చరణ్ ఫిదా చేసిన సినిమా. అయితే రంగస్థలం అంత బాగా ఆడిదంటే మెయిన్ రీజన్ సుకుమార్. అందుకే సుకుమార్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుందని ఇదివరకే అన్నారు రామ్ చరణ్. దాన్ని నిజం చేస్తూ త్వరలోనే సుక్కూ-చరణ్ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈమధ్య సుకుమార్ చెప్పారు.. అందులోని ఇంట్రడక్షన్ సీన్ గురించి రాజమౌళి రివీల్ చేశారు కూడా. త్వరలోనే సెట్స్ పైకెళ్లబోతున్నారు మహేశ్-త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత కలిసొస్తున్న కాంబో ఇది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లకు, మహేశ్ టైమింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తారు ఫ్యాన్స్. అయితే ఈసారి డోస్ డబుల్ చేసి పాన్ ఇండియా సినిమాతో వీళ్లిద్దరూ రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

జనతా గ్యారేజ్ తర్వాత మరో స్టైలిష్ మాస్ మసాలా సినిమాను రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్-కొరటాల. వచ్చే ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందే తారక్ కి వచ్చిన ప్యాన్ ఇండియా స్టార్ డంను దృష్టిలో పెట్టుకుని నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్టోరీని రెడీ చేస్తున్నారు కొరటాల. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబోకీ సూపర్ క్రేజ్ ఉంది ఫ్యాన్స్ లో. గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది వీరి కాంబోలో. నెక్ట్స్ భవధీయుడు-భగత్ సింగ్ ని చూపించబోతున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాక.. హరీశ్ శంకర్ సినిమాతో బిజీ అవుతారు పవర్ స్టార్.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

తెలుగులోనే కాదు బాలీవుడ్, కోలివుడ్ లోనూ స్టార్ డైరెక్టర్-స్టార్ హీరో క్రేజీ కాంబోస్ చాలానే సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి. సల్మాన్, షారుఖ్, అక్షయ్ తో పాటూ ఇటు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్ లాంటి స్టార్స్ వాళ్లకి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు మళ్లీ మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు.