WTC Team Of The Tournament: డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. విరాట్ కోహ్లీకి దక్కని చోటు.. రిషత్ పంత్‌కు స్థానం
క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia).. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్(WTC Team Of The Tournament ) జట్టును ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.

Rishabh Pant-Virat Kohli
CA WTC Team Of The Tournament: క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia).. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్(WTC Team Of The Tournament ) జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ(WTC) జరిగిన రెండేళ్ల కాలంలో(2021-2023) అన్ని దేశాల జట్లలో రాణించిన ఆటగాళ్లతో కూడిన ఓ జట్టును ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma), పరుగుల యంత్రం విరాట్ కోహ్లి(Virat Kohli), నయావాల్ ఛతేశ్వర పుజారా(Cheteshwar Pujara) లకు చోటు దక్కలేదు. అయితే.. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్( Babar Azam )కు చోటు దక్కడం గమనార్హం.
భారత్ నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా తీసుకుంది. గాయపడడానికి ముందు పంత్ పలు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వన్డే ప్రపంచకప్ సమయానికల్లా అతడు కోలుకుంటాడని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే.
సీఏ ప్రకటించిన జట్టు ఇదే..
ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెను ఎంచుకుంది. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లిని కాదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు చోటు ఇచ్చింది. ఇంగ్లాండ్ ఆటగాడు జోరూట్, ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ లను వరుసగా నాలుగు, ఐదు స్థానాలకు తీసుకుంది. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంచుకుంది. స్పిన్నర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు కల్పించింది. ఇక ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, ఇంగ్లాండ్ ఆటగాడు అండర్సన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ కగిసో రబాడ లను తీసుకుంది.
జట్టు ఇదే.. ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నె, బాబర్ ఆజమ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, కగిసో రబాడ
ఇదిలా ఉంటే.. జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు లండన్‌కు చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.