CM Mamata : పశ్చిమబెంగాల్‌పై కన్నేస్తే..బెంగాల్‌ టైగర్లున్నాయ్..జాగ్రత్త : బీజేపీకి దీదీ ధమ్కీ

బీజీపీపై సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పశ్చిమబెంగాల్ కు రావాలంటే బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్.. రాయల్‌ బెంగాల్‌ టైగర్లు దాడి చేస్తాయి.. ఏనుగులు తొక్కిపడేస్తాయి జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మమతా.

CM Mamata : పశ్చిమబెంగాల్‌పై కన్నేస్తే..బెంగాల్‌ టైగర్లున్నాయ్..జాగ్రత్త : బీజేపీకి దీదీ ధమ్కీ

Cm Mamata Banerjee Attack Warning To Bjp

CM Mamata Banerjee Attack Warning To BJP : పశ్చిమ బెంగాల్‌ ఆడపులి..సీఎం మమతా బెనర్జీ కేంద్రంలో ఉన్న బీజేపీకీ మరోసారి థమ్కీ ఇచ్చారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిపోయిన బీజేపీకి భయపడేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు దీదీ. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బీజీపీపై సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎవవీఏ)ప్రభుత్వాన్ని కూల్చి వేసి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈక్రమంలో మహారాష్ట్రలో జరిగింది పశ్చిమ బెంగాల్ లో జరుగదు అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు మమతా. మహారాష్ట్ర తరువాత చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ పై దృష్టి సారించి అధికారం చేజక్కించుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు.

దీంట్లో భాగంగా దీదీ తనదైన శైలిలో విరుచుకుపడుతూ..మీరు ఇక్కడ (పశ్చిమబెంగాల్)కు రావాలంటే… బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్.. సుందరబన్స్‌లోని రాయల్‌ బెంగాల్‌ టైగర్లు, ఏనుగులు మీపై దాడి చేస్తాయ్‌ జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మమతా. పార్థ ఛటర్జీ అడ్మిట్‌ అయిన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ హస్పటల్‌ అయినప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పారు? అంటూ ప్రశ్నించారు.

పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్పత్రి (భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌)కే ఆయన్ను ఎందుకు తరలించారు?. అసలు మీ ఉద్దేశం ఏంటీ? అంటూ నిలదీశారు. ఇది ముమ్మాటికీ బెంగాల్‌ ప్రజలను అవమానపరచటేమే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమాయకమైనదీ..మరి రాష్ట్రాలన్నీ దొంగలా? అంటూ బీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారు అంటూ మమతా బెనర్జీ బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు.

కాగా..పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ పై ఫోకస్ పెడుతున్న క్రమంలో దీదీ ఇచ్చిన ఈ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.