Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరిక!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్రిప్టోకరెన్సీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.. ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరిక!

Das

Cryptocurrency: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్రిప్టోకరెన్సీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా క్రిప్టోకరెన్సీలు రాబోయేకాలంలో అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అబిప్రాయపడ్డారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ప్రభుత్వానికి ఈమేరకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.

క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్యను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది వెల్లడించారు శక్తికాంత దాస్. క్రిప్టోకరెన్సీలో వ్యాపారం చేయడానికి ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి రిటైల్ ఇన్వెస్టర్లలో విపరీతమైన క్రేజ్ ఉన్న సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారాయి. దేశంలో క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న పెట్టుబడిదారుల సంఖ్య 100 మిలియన్లు దాటింది.

Pak soldier to Bharath Padma Shri: పాకిస్థాన్ సైనికుడికి భారత పద్మశ్రీ పురస్కారం..

క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటి నుంచి దేశంలో క్రిప్టోకరెన్సీల క్రేజ్ పెరిగింది. ఫిబ్రవరి 5, 2021న, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ నమూనాను సూచించడానికి RBI అంతర్గత ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి చట్టాన్ని రూపొందించలేదు. అయితే ఈ సమస్యపై స్టేక్‌హోల్డర్లు, అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖలతో నిరంతరం చర్చిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా డిజిటల్ కరెన్సీ పాపులారిటీ పెరుగుతోంది. బ్లాక్ చెయిన్ సాఫ్ట్‌వేర్ ద్వారా దీనిని ఉపయోగించవచ్చు. ఈ డిజిటల్ కరెన్సీ ఎన్‌క్రిప్టెడ్. అంటే కోడెడ్‌గా ఉంటుంది. అందుకే దానిని క్రిప్టో కరెన్సీ అని పిలుస్తారు.

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు సొంతూరిలో కూడా మా ప్రభుత్వమే బాగుచేసింది -సజ్జల రామకృష్ణా రెడ్డి