Pak soldier to Bharath Padma Shri: పాకిస్థాన్ సైనికుడికి భారత పద్మశ్రీ పురస్కారం..

పాకిస్థాన్ సైనికుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసి సత్కరించింది. పాకిస్థానీ సైనికేడికి భారత్ పద్మ పురస్కారం ఇవ్వటం వెనుక ఉన్న ఆసక్తికర కథనం..

Pak soldier to Bharath Padma Shri: పాకిస్థాన్ సైనికుడికి భారత పద్మశ్రీ పురస్కారం..

India Pakistan And Bangladesh

Pak soldier to Bharath Padma Shri: పద్మ పురస్కారం. భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరిస్తుంది ప్రభుత్వం. అది వారికి ఇచ్చే గౌరవం. భారతదేశం ఇచ్చే ఈ పద్మ అవార్డులు పొందటం అంతే ఓ ఘనత సాధించినట్లే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కొన్ని కీలక సందర్భాల్లో విదేశీయులకు కూడా భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తుంది. అలా 2020 ఏడాదికి గాను ఓ పాకిస్థాన్ సైనికుడికి భారత్ ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ఇచ్చింది. పాకిస్థాన్ అంటే భారత్ కు సరిహద్దు దేశం.దాయాది దేశం కూడా. ఇరు దేశాలకు ఎప్పుడు సరిహద్దుల విషయంలో విభేధాలే. దాడులు. ప్రతిదాడులు కొనసాగుతునే ఉంటాయి. ఈక్రమంలో ఓ పాకిస్థాన్ సైనికుడి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ఇవ్వటం చాలా ఆసక్తికరంగా మారింది. మరి పద్మ అవార్డు పొందేంత గొప్ప పని అతను ఏం చేశాడు? అతను ఎవరు? అనే పలు ఆకస్తికర విశేషాలు తెలుసుకుందాం..

Read more : Padma Shri : రోడ్డుపై బత్తాయి పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

పాక్‌ నుంచి భారత్‌ వచ్చి.. బంగ్లాకు ముక్తినివ్వటానికి భారత్ కు సహకరించిన మహోన్నత వ్యక్తి..క్వాజీ సజ్జాద్ అలీ జహీర్. రిటైర్డ్‌ కల్నల్‌ ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్‌. జేబులో ఇరవై రూపాయలు.. ఒంటిపై ప్యాంటు, చొక్కా..పాక్ నుంచి పారిపోతున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నవి కేవలం ఇవి మాత్రమే. దేశ రక్షణ కోసం పాక్‌ ఆర్మీలో చేరిన ఆయన.. అదే సైనికులు తూర్పు పాకిస్థాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాల్పడుతున్న దురాగతాలను చూస్తూ ఉండలేకపోయారు. భరించలేకపోయారు. అందుకే యుద్ధ రహస్యాలతో పాకిస్థాన్‌ నుంచి కట్టుబట్టలతో జేబులో కేవలం రూ.20లతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. తూర్పు పాకిస్థాన్‌ ‌(ప్రస్తుత బంగ్లాదేశ్)ను విముక్తి చేయడంలో క్వాజీ కీలకపాత్ర పోషించారు.

కల్నల్ ఖాజీ సజ్జద్‌ అలీ జహీర్. తూర్పు పాకిస్థాన్‌ ప్రజల స్వేచ్ఛ కోసం చేసిన కృషికి గానూ..2020కి గాను ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. కల్నల్‌ ఖాజీ జహీర్‌ తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోని కొమిల్లా జిల్లా చౌసాయి గ్రామంలో జన్మించారు. 18ఏళ్ల వయసులో 1969లో దేశ సైన్యంలో చేరారు. 1971లో కాకుల్‌ మిలిటరీ అకాడమీలో సీనియర్‌ కాడెట్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. అతనంతరం అదే సంవత్సరంలో పాక్‌ ఆర్మీ ఆర్టిల్లరీ కార్ప్స్‌లో చేరారు. అదే సమయంలో తూర్పు పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాటం కొనసాగుతోంది.

Read more : Manjamma Jogati : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ.. రాష్ట్ర‌ప‌తికి చీర కొంగుతో దిష్టితీసిన ట్రాన్స్ జెండర్

సైన్యం దురాగతాలను తట్టుకోలేక..కట్టుబట్టలతో భారత్ కు
స్వాత్రంత్యం కోసం పోరాటం చేస్తున్న తూర్పు పాకిస్థానీల పట్ల పాకిస్థాన్ సైన్యంఅత్యంత కిరాతకంగా వ్యవహరిస్తు లక్షమందికి పైగా బలితీసుకుంది పాకిస్థాన్. ఆ దురాగతాలు చూసిన క్వాజీ భరించలేకపోయారు. పాక్ ఆర్మీ అకృత్యాలను తట్టుకోలేక జహీర్‌.. పాక్‌ విడిచి పారిపోయి జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దును దాటి భారత్‌లోకి కట్టుబట్టలతో 20 రూపాయలతో వచ్చేశారు. ఆ తర్వాత భారత సైన్యాన్ని సంప్రదించారు. జరుగుతున్న పరిస్థితిని వివరించారిస్తు పాకిస్థాన్ యుద్ధం ప్లాన్స్ అన్నీ తనకు తెలసని చెప్పారు.

బంగ్లా తరఫున యుద్ధంలోకి భారత్ కు మద్దతుగా..
పాక్‌ అరాచకాలను తట్టుకోలేక లక్షలాదిమంది తూర్పు పాకిస్థాన్‌కు చెందిన ప్రజలు భారత్‌లోకి కాందీశీకులుగా తరలివచ్చారు. 1971 విముక్తి పోరాటంలో తూర్పు పాకిస్థాన్‌ యోధులకు భారత్‌ సైనికుల్ని ఇచ్చి సహాయం చేసింది. ముక్తివాహనికి ఆయుధాలు అందించింది. పాక్‌ నుంచి వచ్చిన తర్వాత జహీర్‌.. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్నారు. ముక్తివాహనికి సహ కెప్టెన్‌గా పనిచేశారు. సాధారణ పౌరులు కూడా మేమున్నాం అన్నారు. దీంతో పౌరులకు సైనిక టైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ముక్తివాహిని జడ్‌ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసి యుద్ధానికి సన్నద్ధం చేశారు. అలా తూర్పు పాకిస్థాన్‌ విముక్తికి ఎనలేని కృషి చేశారు ఖ్వాజీ. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించడంతో తూర్పు పాకిస్థాన్‌కు స్వాతంత్ర్యం లభించి బంగ్లాదేశ్‌ కొత్తదేశంగా ఏర్పడింది.

జహీర్‌ పై పాక్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న డెత్‌ వారెంట్‌..
జహీర్‌ పాక్ విడిచి వచ్చేసినప్పుడు ఆయన కుటుంబం పాక్ లోనే ఉండిపోయింది.దీంతో జహీక్ కుటుంబంపై పాక్ ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపింది. ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. మానసికంగా చిత్రహింసలకు గురించేసింది. భయ భ్రాంతులకు గురిచేస్తు ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలోని ఆయన ఇంటికి పాక్ సైన్యం నిప్పుపెట్టింది. అంతేకాదు జహీర్ తల్లి, కుమార్తెను పాక్‌ సైనికులు తరిమికొట్టారు. చిత్రహింసలు పెట్టారు. జహీర్‌పై పాకిస్థాన్‌ ఆర్మీ మరణశిక్ష విధించింది.

Read more : PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా పాక్ ప్రభుత్వం జహీర్ పై డెత్ వారెంట్ కొనసాగిస్తునే ఉంది. తన కుటుంబాన్ని కూడా వదిలేసి బంగ్లా స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని యుద్ధంలో పాల్గొన్నారు జహీర్. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషికి గానూ 2013లో బంగ్లా ప్రభుత్వం జహీర్‌ను అత్యున్నత పౌర పురస్కారం ఇండిపెండెన్స్‌ డే అవార్డ్‌తో సత్కరించింది. భారత్ కూడా జహీర్ కు పద్మశ్రీ అవార్డును ప్రకటించి ప్రధానం చేసి సత్కరించింది.