Manjamma Jogati : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ.. రాష్ట్ర‌ప‌తికి చీర కొంగుతో దిష్టితీసిన ట్రాన్స్ జెండర్

కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్ర‌ప‌తి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.

Manjamma Jogati : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ.. రాష్ట్ర‌ప‌తికి చీర కొంగుతో దిష్టితీసిన ట్రాన్స్ జెండర్

Ttransgender Manjamma Jogati Padma Shri

Ttransgender folk dancer Manjamma Jogati receives padma shri : పద్మశ్రీ అవార్డు అందుకుంటూ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు ట్రాన్స్ జెండర్ చీర కొంగుతో దిష్టితీసిన మంజ‌మ్మ జోగ‌తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ జాన‌ప‌ద నృత్య‌కారిణి, ట్రాన్స్‌జెండ‌ర్ అయిన మంజ‌మ్మ జోగ‌తిని పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ పురస్కారాలు గెలుచుకున్నవారికి రాష్ట్రపతి మంగ‌ళ‌వారం (నవంబర్ 9,2021) అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ట్రాన్స్ జెండర్ మజమ్మ జోగతి ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్న‌ారు. ఆ అవార్డు స్వీక‌రించేందుకు వెళ్లిన మంజ‌మ్మ .. త‌న‌దైనశైలిలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించారు. తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసి.. శుభం క‌లిగేలా ఆశీర్వాదాలు అందజేశారు మంజమ్మ. దీంతో రాష్ట్రతి చిరునవ్వులు చిందించారు. ప‌ద్మ అవార్డుల వేడుక ఇటువంటి వినూత్న ఘ‌ట‌న మంజమ్మ ద్వారా చోటుచేసుకోవటం విశేషం.

Read more : Padma Shri : రోడ్డుపై బత్తాయిలు పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

క‌ర్నాట‌క‌కు చెందిన ట్రాన్స్‌జెండ‌ర్ మంజ‌మ్మ‌కు జానపద నృత్యకళాకారిణి. ఈ క్యాట‌గిరీలో మంజమ్మకు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. అయితే ఆ అవార్డును అందుకునేందుకు రాష్ట్ర‌ప‌తి కోవింద్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆమె ఆయ‌న్ను దీవించింది. త‌న చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం క‌లిగేలా దీవ‌నెలు ఇవ్వటం అక్క‌డ ఉన్న‌వారిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ట్రాన్స్‌జెండ‌ర్లు దీవిస్తే మంచి జ‌రుగుతుందనే నమ్మకం ఉన్న విషయం తెలిసిందే.

కర్ణాటకలోని బ‌ల్లారి జిల్లాలో మంజూనాథ్ శెట్టిగా మంజ‌మ్మ జ‌న్మించింది. 10వ త‌ర‌గ‌తి చ‌దువుకుంది. మగపిల్లాడిగా పుట్టిన మంజూనాథ్ శెట్టి తన యుక్తవయస్సులో అడుగుపెట్టాక తనలో స్త్రీ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించాడు. అలా తన 15 ఏళ్ల వ‌య‌సులో స్త్రీ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించి ఆమె తల్లిదండ్రులు మంజూనాథ్ శెట్టిని మంజమ్మగా మారింది. ఆమెను హోస్‌పేట్‌లోని దేవాల‌యానికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు అక్క‌డ జోగ‌ప్ప పూజ‌లు చేశారు. దేవ‌తతో ఆమెకు పెళ్లి చేశారు. అప్ప‌టి నుంచి మంజూనాథ్ శెట్టి కాస్త మంజ‌మ్మ జోగ‌తిగా మారింది. ఆ త‌ర్వాత‌ ఆమె త‌న సొంతఇంటికి వెళ్ల‌లేదు. తన బతుకు తాను బతకటం అలవాటు చేసుకుంది.

Read more : PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

అలా 15ఏళ్లకే ఇల్లు వదిలిన ఆమె ఎలా బతకాలో తెలిదు. తనలాంటివారు ఎక్కడుంటారో? వారిని ఎలా కలవాలో అర్థం కాలేదు. దాంతోఆమె బతకటానికి..చీర క‌ట్టుకుని వీధుల్లో తిరుగుతు భిక్షాట‌న చేసేది. ఈ క్రమంలో ఆమెపై పలువురు లైంగిక వేధింపుల‌కు గురిచేసేవారు. అవహేళన చేసేవారు. అలా అలా ఆమె జీవితం తిరిగి తిరిగి ..చివ‌ర‌కు క‌ల్ల‌వ జోగ‌తి అనే నత్యకళాకారుడి చెంతకు చేరింది. అలా ఆమెకు ఆమెకు డ్యాన్స్ నేర్పాడు. దాంతో ఆమెకు కొత్త జీవితం దొరికినట్లైంది. అలా అతని వద్ద మంజమ్మ జోగ‌ప్ప జాన‌ప‌ద నృత్యం నేర్చుకుంది. నృత్యంలో చక్కటి ప్రావీణ్యత సంపాదించింది. చక్కటి హావభావాలతో ఆమె నృత్యం పలువురిని అలరించింది.దీంతో మంజమ్మ ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది.

Read more :  Padma Shri Tulasi Gowda: కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ

అలా కర్ణాటక రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది. ఈ క్రమంలో క‌ల్ల‌వ జోగ‌తి మ‌ర‌ణం త‌ర్వాత ఆ క‌ళాబృందానికి మంజ‌మ్మ నాయ‌క‌త్వం వ‌హించింది. అలా ఆమె తన ప్రతిభతో క‌ర్నాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా నియ‌మితులైన తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌గా మంజ‌మ్మ చరిత్ర సృష్టించారు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం త‌ర‌పున జాన‌ప‌ద అకాడ‌మీ త‌న కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తోంది. మంజ‌మ్మ ప‌ద్మ‌శ్రీ అవార్దు అందుకోవ‌డం సంతోషాన్ని ఇస్తోంద‌ని ప్ర‌ముఖ ట్రాన్స్‌జెండ‌ర్ కార్య‌క‌ర్త అక్కాయి ప‌ద్మ‌శాలి తెలిపారు. అలా తన 15 వ ఏట ఇల్లు వదిలిని మంజమ్మ..రాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టి దేశ ప్రథమ పౌరుడి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరుకుంది మంజమ్మ జోగతి.