Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం..

Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం

Shiva Shankar Master

Updated On : November 24, 2021 / 11:53 PM IST

Shiva Shankar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు డాక్టర్లు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తల్లీదండ్రి, అన్న బాగోగులు చూసుకుంటున్నాడు.

Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు

కాగా, శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజూ లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చవుతోంది. ప్రస్తుతం తమ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయవలసిందిగా శివ శంకర్ మాస్టర్ కొడుకు అజయ్ కృష్ణ మాస్టర్ కోరుతున్నాడు. శివ శంకర్ మాస్టర్ డ్యాన్స్‌‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ క్రేజ్ ఉంది. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక డాన్స్ మాస్టర్ గా కాకుండా నటుడుగా కూడా పలు సినిమాల్లో కనిపించి మెప్పించారు.

ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అంటున్నారు అభిమానులు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా? పరిష్కారం ఏంటంటే..

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పోస్టు కోవిడ్ సమస్యలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సినీ పరిశ్రమే కాదు ప్రేక్షకులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకుంటున్నారని ఊపిరి తీసుకునే లోపు.. శిశ శంకర్ మాస్టర్ వార్త తెలిసింది.