Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా?…పరిష్కారం ఏమిటంటే?..

ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి. ఉదయము నుండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది అల్పాహారమేనని గుర్తుంచుకోవాలి.

Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా?…పరిష్కారం ఏమిటంటే?..

Abdominal Fat

Belly Fat : వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు పైబడినవారిలా కనిపించేలా చేస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది.పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. వంశపారంపర్యంగా కూడా బరువు పెరగకుండా బొజ్జ పెరిగే అవకాశం ఉంటుంది.

బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఆహార పదార్థాలు తీసుకునే సమయంలో సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.

గుడ్డులోని తెల్లసొన , పండ్లు, పచ్చిగా తినగలిగే కాయకూరలు , ఆవిరిమీద ఉడికే కాయకూరలు , యాపిల్ పండ్లు , కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు వంటి ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి.

ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి. ఉదయము నుండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది అల్పాహారమేనని గుర్తుంచుకోవాలి. అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి. రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా, పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి.

వేపుడు కూరలు ఆరోగ్యరీత్యా మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి. నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

టెన్షన్స్ మంచిది కాదు. ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికము గా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. నడవటం, పరిగెత్తటం వంటి వ్యాయామాలు చేయటం వల్ల ఫలితం ఉంటుంది.