Prabhas : ప్రభాస్ వంటకాలకు ఫిదా అయిన దీపిక

ఎప్పటిలాగే దీపికా పదుకొణెకి కూడా త‌న ఇంటి నుంచి రకరకాల వంటలు తెప్పించి స్వయంగా వడ్డించాడంట ప్రభాస్. ప్రభాస్ తెప్పించిన వంటలు, చేసిన అతిథి మ‌ర్యాద‌ల‌తో దీపిక..........

Prabhas : ప్రభాస్ వంటకాలకు ఫిదా అయిన దీపిక

Prabhas

Prabhas :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల అవ్వనుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’, సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేసాడు. ఇక తన సినిమాలోని హీరోయిన్స్ కి ఆర్టిస్టులకు ప్రభాస్ చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. ప్రభాస్‌ తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తే సెట్ లో అందరికి పండుగే. వెరైటీ వంట‌లతో తన కో ఆర్టిస్టులకు అతిధి మర్యాదలు బాగానే చేస్తాడు ప్రభాస్.

Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హ‌ర్బ‌జ‌న్ సింగ్

ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతీసారి ఆ వంటలని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. గతంలో ‘సాహో’ సినిమా షూటింగ్ టైంలో శ్రద్ధ కపూర్ కి, ‘సలార్’ చిత్రీకరణ షూటింగ్ లో శృతిహాసన్ కి, ‘ఆదిపురుష్’ సినిమాలో కృతిసనన్ కి ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ పెట్టడంతో వాళ్ళు ఫిదా అయిపోయారు. ఇటీవల కరీనా కపూర్ ఫ్యామిలీకి బిర్యానీ పార్శిల్ పంపాడు ప్రభాస్. ప్రభాస్ మర్యాదలకు, ఆ ఫుడ్ కి ఫ్యాన్ అయిపోతున్నారు. తాజగా దీపికకి కూడా స్పెషల్ ఫుడ్ తెప్పించి వడ్డించాడట ప్రభాస్. ,

Project K : చేయి చేయి కలిపిన ప్రభాస్ – దీపికా పదుకొణె

తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే హైదరాబాద్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీంతో ఎప్పటిలాగే దీపికా పదుకొణెకి కూడా త‌న ఇంటి నుంచి రకరకాల వంటలు తెప్పించి స్వయంగా వడ్డించాడంట ప్రభాస్. ప్రభాస్ తెప్పించిన వంటలు, చేసిన అతిథి మ‌ర్యాద‌ల‌తో దీపిక స్ట‌న్ అయిపొయింది. ఆ వంటలని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రభాస్ ని, సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేసింది.