IPL 2023, DC vs KKR: ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన ఢిల్లీ.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలుపొందింది.

IPL 2023, DC vs KKR: ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన ఢిల్లీ.. లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై విజ‌యం

david warner

IPL 2023, DC vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గెలుపొందింది. కోల్‌క‌తా నిర్దేశించిన 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ (57; 41 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో అల‌రించాడు. ఓద‌శ‌లో ఈజీగా గెలిచేలా క‌నిపించినా వార్న‌ర్ ఔట్ కావ‌డంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కోల్‌క‌తా బౌల‌ర్లు స‌త్తా చాట‌డంతో ప‌రుగుల వేగం మంద‌గించింది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. దీంతో మ‌రోసారి ఢిల్లీ ఓడిపోయేలా క‌నిపించింది. అయితే.. మ‌నీష్ పాండే(21), అక్ష‌ర్ ప‌టేల్‌(19 నాటౌట్‌) రాణించ‌డంతో ఈ సీజ‌న్‌లో ఢిల్లీ గెలుపు రుచి చూసింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్, నితీశ్ రాణాలు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యంగా వేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై తేమ‌ను స్వ‌దినియోగం చేసుకున్న ఢిల్లీ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో 15 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా తొలి వికెట్‌ను కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన లిట‌న్ దాస్‌ను ముకేశ్ కుమార్ ఔట్ చేశాడు. ఇలా మొద‌లైన వికెట్ల ప‌త‌నం ఎక్క‌డా ఆగ‌లేదు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి జేస‌న్ రాయ్‌(43; 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్ర‌య‌త్నం చేసినా అత‌డికి స‌హ‌క‌రించే వారు క‌రువు అయ్యారు.

IPL 2023, DC vs KKR: కోల్‌క‌తా పై ఢిల్లీ విజ‌యం..Updates

దీంతో 96 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా క‌నీసం 100 ప‌రుగులైనా దాటుందా అని సందేహం క‌లిగింది. అయితే తాను ఉన్నానంటూ ఆఖ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్ చెల‌రేగిపోయాడు. ఆండ్రీ ర‌స్సెల్‌(38 నాటౌట్‌; 31 బంతుల్లో 1ఫోర్, 4సిక్స‌ర్లు) రాణించ‌డంతో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ, అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ త‌లా రెండు వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.