CM Arvind Kejriwal: అలా అయితే 100 సంవత్సరాలు పడుతుంది..! ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలోని 80శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలలు చెత్తకుండీల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు.

CM Arvind Kejriwal: అలా అయితే 100 సంవత్సరాలు పడుతుంది..! ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..

Arvind Kejriwal

CM Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలోని 80శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలలు చెత్తకుండీల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు. దేశంలోని మొత్తం 10లక్షల ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలని కేజ్రీవాల్ అన్నారు. రెండురోజుల క్రితం ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ.. స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI) యోజన కింద భారతదేశంలో 14,500 పాఠశాలల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్‌ను చేస్తామని ప్రకటించారు. ప్రధాని మాటలను ప్రస్తావిస్తూ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని సముద్రంలో నీటిచుక్క అని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని పాఠశాలలను అప్ గ్రేడ్ చేయడానికి 100 సంవత్సరాలు పడుతుందని కేజ్రీవాల్ అన్నారు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

భారతదేశంలో.. రోజూ 27కోట్ల మంది విద్యార్థులు పాఠశాలకు వెళుతుండగా, అందులో 18కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే, 80శాతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చెత్తాచెదారంతో అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కోట్లాది మంది పిల్లలకు మనం అలాంటి విద్యను అందజేస్తుంటే, దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ కేజ్రీవాల్ హిందీలో మోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు.

Indians Use Antibiotics: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్‌లో అజిత్రోమైసిన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సోమవారం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI) యోజనను ప్రకటించారు. దీనికింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలు PM-SHRI పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయబడతాయని, ఈ పాఠశాలలు మోడల్ పాఠశాలలుగా మారతాయని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 యొక్క పూర్తి స్ఫూర్తి నింపే మోడల్ స్కూళ్లుగా మారుతాయని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేక రాశారు.