Vaccination In Delhi : ఢిల్లీలో 100శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం,దీనికి తీడు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు కూడా

Vaccination In Delhi :  ఢిల్లీలో 100శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి

Kejriwal

Updated On : December 24, 2021 / 4:14 PM IST

Vaccination In Delhi :  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం,దీనికి తీడు కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత స్పీడప్ చేశాయి.

తాజాగా ఢిల్లీలో ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ 100శాతం మంది అర్హులకు పూర్తి అయినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలోని 1కోటి 48లక్షల 33వేల మంది అర్హులు..మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు శుక్రవారం ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్లు,ఏఎన్ఎమ్ లకు,టీచర్లకు,ఆశా వర్కర్లు,సీడీవీ,ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ లో తెలిపారు. డీఎమ్ లు,సీడీఎమ్ఓ లు,డీఐఓలు,అన్ని జిల్లా అధికారులకు కేజ్రీవాల్ అభివనందనలు తెలియజేశారు.

ఇక,గత ఏడు రోజులుగా ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతన్నాయి. డిసెంబర్ 9-16 మధ్యలో ఢిల్లీలో 362 పాజిటివ్ కేసులు నమోదుకాగా…డిసెంబర్ 16-22 మధ్యలో 712 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 67 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం 684 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ALSO READ Tollywood Films : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి..ఎంతంటే