Gems and James Bond: ‘జేమ్స్‌ బాండ్’పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

ఢిల్లీ హైకోర్టు ‘జేమ్స్‌ బాండ్’పై దేశంలో నిషేధం విధించింది. అయితే, ‘జేమ్స్‌ బాండ్’ అంటే సినిమా కాదు. చాక్లెట్లు. క్యాడ్‌బరి సంస్థ తయారు చేసే ‘జెమ్స్’ చాక్లెట్లకు నకిలీగా వచ్చినవే ‘జేమ్స్‌ బాండ్’/‘జెమ్స్‌ బాండ్’ చాక్లెట్లు. ఇకపై ఈ నకిలీ చాక్లెట్లు అమ్మకూడదని కోర్టు ఆదేశించింది.

Gems and James Bond: ‘జేమ్స్‌ బాండ్’పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

Gems And James Bond

Gems and James Bond: ‘జేమ్స్‌ బాండ్’పై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. ‘జేమ్స్‌ బాండ్’ అంటే సినిమా అనుకోకండి. చాక్లెట్స్. ‘జేమ్స్‌ బాండ్’/‘జెమ్స్‌ బాండ్’ పేరుతో మార్కెట్లో చాక్లెట్ల విక్రయాలు చేయకూడదని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. క్యాడ్‌బరి సంస్థ తయారు చేసే ప్రఖ్యాత ‘జెమ్స్’ చాక్లెట్ల గురించి తెలిసిందే. బటన్ సైజులో ఉండే ఇవి చాలా ఏళ్లుగా పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటున్నాయి.

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

అంతకుముందు ఉన్న చాక్లెట్లకు భిన్నంగా చిన్న సైజులో, విభిన్న రంగులు, రుచితో ఇవి వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. క్యాడ్‌బరి సంస్థ నుంచి బాగా సక్సెస్ అయిన వాటిలో ‘జెమ్స్’ ముఖ్యమైవని. అంతగా ఆదరణ పొందిన ‘జెమ్స్’కు నకిలీ బెడద తప్పలేదు. దేశీయ సంస్థ అయిన ‘నీరజ్ ఫుడ్ ప్రొడక్ట్’ జెమ్స్ లాంటివే తయారు చేసి మార్కెట్లో అమ్ముతోంది. ‘జేమ్స్‌ బాండ్’/‘జెమ్స్‌ బాండ్’ పేర్లతో వీటిని విక్రయిస్తోంది. వీటి ప్యాకేజ్ దగ్గరి నుంచి టేస్ట్, రంగులు, సైజ్.. అన్నీ దాదాపు క్యాడ్‌బరి సంస్థ తయారు చేసే ‘జెమ్స్’లానే ఉంటాయి. దీంతో తమ పేరు, డిజైన్లను పోలి ఉన్న వీటిపై నిషేధం విధించాలని క్యాడ్‌బరి సంస్థ 2005లో కోర్టును ఆశ్రయించింది. అప్పట్నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. మధ్యలో కోర్టు బయటే సమస్యను పరిష్కరించుకునేందుకు కోర్టు అనుమతించింది.

No Smoking: 2007 తర్వాత పుడితే ఇకపై జీవితాంతం నో స్మోకింగ్… కొత్త చట్టం ఎక్కడంటే

అయితే, అది సాధ్యం కాలేదు. చివరకు మళ్లీ వివాదం కోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. ‘జెమ్స్’ రూపాన్ని, రంగులు, ప్యాకేజింగ్ డిజైన్స్ పోలి ఉన్న ‘జేమ్స్‌ బాండ్’/‘జెమ్స్‌ బాండ్’ వంటి చాక్లెట్లు అమ్మకూడదని నీరజ్ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి విక్రయించకూడదని సూచించింది. అంతేకాదు.. క్యాడ్‌బరి సంస్థకు 15.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.