No Smoking: 2007 తర్వాత పుడితే ఇకపై జీవితాంతం నో స్మోకింగ్… కొత్త చట్టం ఎక్కడంటే

2007 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టప్రకారం నేరం. దీని ప్రకారం జైలు శిక్ష కూడా ఉండొచ్చు. అయితే, ఈ చట్టం రాబోతుంది మన దేశంలో మాత్రం కాదు.

No Smoking: 2007 తర్వాత పుడితే ఇకపై జీవితాంతం నో స్మోకింగ్… కొత్త చట్టం ఎక్కడంటే

No Smoking

No Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసిందే. దీన్ని అరికట్టేందుకు మన దగ్గర ప్రభుత్వాలు ప్రచారం మాత్రమే చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే మన దేశంలో స్మోకింగ్ చేయొచ్చు. ఈ అర్హత వయస్సును 21కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే, కొన్ని దేశాలు మాత్రం ధూమపానం నిషేధం గురించి ఆలోచిస్తున్నాయి.

Monkeypox Vaccine: మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. తయారీ కంపెనీలకు ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

ఇప్పటికే న్యూజిలాండ్ ఈ తరహా నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు మలేసియా కూడా దీని గురించి ఆలోచిస్తోంది. ధూమపానంపై నిషేధం విధించే ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. అయితే, అందరికీ నిషేధం విధించట్లేదు. 2007 జనవరి 1, ఆ తర్వాత పుట్టిన వాళ్లు ధూమపానం చేయడంపై నిషేధం విధించనుంది. 2007లో పుట్టిన వారికి ప్రస్తుతం 15 ఏళ్లుంటాయి. ఇప్పుడు వీరికి ధూమపానం చేసేందుకు అర్హత లేదు. అలాగని వీళ్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ధూమపానం చేయడానికి వీల్లేదు. అంటే 2007 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. వీళ్లు సిగరెట్లు, ఈ సిగరెట్లు వంటివి తాగినా, కొన్నా, కలిగి ఉన్నా చట్టప్రకారం నేరమే. అలాగే వీళ్లకు విక్రయించినా.. అమ్మకందారులపై చర్యలు తీసుకుంటారు.

Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

సిగరెట్లు, బీడీలు వంటి వాటితోపాటు అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉంటుంది. న్యూజిలాండ్ కూడా ఇటీవల ఇలాంటి బిల్లే రూపొందించింది. దీని ప్రకారం 2009 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ధూమపానం చేయడానికి వీల్లేదు. మలేసియాలో నిజానికి 2005 తర్వాత పుట్టిన వాళ్లు స్మోకింగ్ చేయడంపై నిషేధం విధించాలనుకున్నారు. అనేక పరిశీలనల తర్వాత దీన్ని 2007కు మార్చారు. త్వరలోనే ఈ బిల్లు అమల్లోకి రానుంది.