Delhi Mayor: ఢిల్లీ మేయర్ పీఠం దక్కేది ఎవరికి? బుధవారమే మేయర్ ఎన్నికకు ముహూర్తం

సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య వివాదం కొనసాగుతోంది.

Delhi Mayor: ఢిల్లీ మేయర్ పీఠం దక్కేది ఎవరికి? బుధవారమే మేయర్ ఎన్నికకు ముహూర్తం

Delhi Mayor: ఢిల్లీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ మేయర్ ఎన్నిక తిరిగి బుధవారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య వివాదం కొనసాగుతోంది. దీని కోసం మూడుసార్లు ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో త్వరగా మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదని సూచించింది. ఈ రోజు ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్‌గా ఎన్నికైన వ్యక్తి ఆధ్వర్యంలోనే డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక జరుగుతుంది. గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక సీట్లతో మెజారిటీ సాధించింది. మొత్తం 250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. దీంతో 15 ఏళ్లుగా సాగుతున్న బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది.