Petrol Price: పెట్రోల్‌పై రూ.8 తగ్గించిన ఢిల్లీ గవర్నమెంట్

ఢిల్లీ గవర్నమెంట్ బుధవారం రెడ్యూస్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ను 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. ఫలితంగా పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తూ.. రూ.8తగ్గింది.

Petrol Price: పెట్రోల్‌పై రూ.8 తగ్గించిన ఢిల్లీ గవర్నమెంట్

Petrol Price

Petrol Price: ఢిల్లీ గవర్నమెంట్ బుధవారం రెడ్యూస్డ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ను 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. ఫలితంగా పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తూ.. రూ.8తగ్గింది. డిసెంబర్ 1 అర్ధరాత్రినుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంచితే 27రోజులుగా ఇందన ధరల్లో హెచ్చుతగ్గులు లేకపోవడం విశేషం. రికార్డ్ స్థాయికి పెరిగిన తర్వాత నవంబర్ 4వ తేదీ నుంచి కొంత మేర మాత్రమే తగ్గాయి.

ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.103.97కు అమ్ముతుంటే, డీజిల్ రేట్ రూ.86.67గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్తుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.98ఉంటే, డీజిల్ ధర లీటర్ రూ.94.14గా అమ్ముడవుతుంది.

……………………………………………: రైతుల నిరసనల్లో ఒక్కరూ మరణించలేదా? కేంద్రం ఏం చెబుతోంది?

మెట్రో సిటీలన్నింటిలో ముంబైలోనే ఇందన ధరలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని బట్టి వ్యాట్ లేదా ట్యాక్స్ లో మార్పులకు అనుగుణంగా ధరలు ఉంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఏ రోజుకారోజు ధరలు రివైజ్ చేస్తుంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర, డాలర్ మారకం విలువ ఆధారంగానే పెట్రోల్ రేట్ నిర్ణయిస్తారు.