Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 920 కొవిడ్ కేసులు.. 1.68శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.

Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 920 కొవిడ్ కేసులు.. 1.68శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

Delhi Records 920 Fresh Cov

Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆంక్షలను కూడా ఒక్కొక్కటిగా సడలిస్తోంది. ఢిల్లీలో శనివారం (ఫిబ్రవరి 12) కొత్తగా కరోనా కేసులు 920 మాత్రమే నమోదయ్యాయి.

రెండు రోజులుగా ఢిల్లీలో వెయ్యిలోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కరోనా మరణాలు 13 నమోదు కాగా.. పాటిజిటివిటీ రేటు 1.68శాతానికి పడిపోయింది. నగరంలో గత 24 గంటల్లో 1,399 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,331కి తగ్గాయి. దేశ రాజధానిలో శుక్రవారం 1.73శాతం పాజిటివ్‌ రేటుతో 977 కేసులు నమోదయ్యాయి.

గురువారం 2.09శాతంగా పాజిటివ్ రేటుతో 1,104 కేసులు నమోదయ్యాయి. జనవరి 13న ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు 28,867కి చేరిన తర్వాత రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత జనవరి 14న ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30.6శాతంగా నమోదైంది, కరోనా మహమ్మారి వేవ్ తీవ్రంగా ఉన్నసమయంలో అత్యధికంగా నమోదైంది.

మరోవైపు దేశవ్యాప్తంగా దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. శుక్రవారం ఒక్కరోజే 50,407 క‌రోనా కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. క‌రోనా నుంచి 1,36,962 మంది కోలుకున్నారు. క‌రోనా కారణంగా 804 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం ఆస్పత్రుల్లో హోం క్వారంటైన్ల‌లో 6,10,443 (1.43 శాతం) మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా మృతుల సంఖ్య‌ 5,07,981కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదైంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 172,29,47,688 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు అందుకున్నారు.

Read Also : North Korea: పువ్వులు పూయించలేదని తోటమాలీలను జైల్లో పెట్టిన కిమ్