Covid Cases In Delhi : కొత్త ఏడాది రోజు ఢిల్లీలో భారీగా కోవిడ్ కేసులు..మే-21 తర్వాత ఇదే అత్యధికం

మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు 1431కి చేరుకోగా,మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 351 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో

Covid Cases In Delhi : కొత్త ఏడాది రోజు ఢిల్లీలో భారీగా కోవిడ్ కేసులు..మే-21 తర్వాత ఇదే అత్యధికం

Delhi

Covid Cases In Delhi :  మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు 1431కి చేరుకోగా,మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 351 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 2716 కొత్త కోవిడ్ కేసులు,ఒక మరణం నమోదైనట్లు శనివారం ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ టెస్ట్ లు చేసినవాళ్లలో 34.6శాతం మందికి పాజిటివ్ గా తేలినట్లు తెలిపింది. అయితే మే-21 నుంచి ఢిల్లీలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. అంతేకాకుండా,శుక్రవారంతో పోల్చితే రోజువారీ కోవిడ్ కేసుల్లో 50 శాతం పెరుగుతదల కనిపించింది. శుక్రవారం 1796 కోవిడ్ కేసులు ఢిల్లీలో నమోదైన విషయం తెలిసిందే.

మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు 1431కి చేరుకోగా,మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 351 కేసులు నమోదయ్యాయి.

ALSO READ Vijayasai Reddy : జిన్నా టవర్ పేరు మార్పు కోరే బదులు ప్రత్యేక హోదా అడగండి