Son Of India Trailer: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేయగా తమిళ సూపర్ స్టార్ సూర్య విడుదల చేసిన సన్నాఫ్ ఇండియా టీజర్ ఆ మధ్య..

Son Of India Trailer: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే..!

Son Of India Trailer

Updated On : February 10, 2022 / 5:43 PM IST

Son Of India Trailer: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేయగా తమిళ సూపర్ స్టార్ సూర్య విడుదల చేసిన సన్నాఫ్ ఇండియా టీజర్ ఆ మధ్య మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో అదరగొట్టగా.. మోహన్ బాబు రోల్‌ను వివరిస్తూ చిరంజీవి చెప్పిన విషయాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఫిబ్రవరి 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే.. సమకాలీన అంశాలపై ఓ కామన్ మ్యాన్ పోరాటంగా కనిపిస్తుంది. మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించగా.. సన్నాఫ్ ఇండియా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో ప్రతి పోరాటం ఒక్కడితోనే మొదలైంది అనే డైలాగ్ తో మొదలయ్యే ఈ ట్రైలర్ లో ఇండియా న్యాయవ్యవస్థ, చట్టాలు, అధికారం అనే అంశాలపైనే ఈ సినిమా ట్రైలర్ కట్ చేశారు.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

సన్ ఆఫ్ ఇండియాకు డైమండ్ బాబు దర్శకుడు కాగా మేస్ట్రోఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. ఇండియాలో నెలకొన్న కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే.. మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ట్రైలర్ అయితే సినీ ప్రియులలో ఆసక్తి కలిగించేలా చేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.